Home Health corona

కరోనా సూపర్‌స్ప్రెడర్స్‌ ఉన్నారు జాగ్రత్త..!


కరోనా సూపర్‌స్ప్రెడర్స్‌..వైరస్‌ బారిన పడి మరీ.. జనంలో తిరిగేస్తున్నారు..టెస్ట్‌లు చేయించుకుని పత్తా లేకుండా పోతున్నారు..ఫోన్‌లు స్విచ్ఛాఫ్‌.. అడ్రస్‌లన్నీ ఫేక్‌..బలాదూర్‌గా తిరిగేస్తూ.. వైరస్‌ విజృంభణకు కారణమవుతున్నారు. పాజిటివ్‌ వస్తే ఐసోలేషన్‌లో ఉండాలని వైద్యులు సూచిస్తుంటే రిపోర్ట్ వచ్చిన తర్వాత కూడా తిరిగేస్తున్నారు.. ఐసోలేషన్‌, క్వారంటైన్‌ అనే ప్రస్తావన లేకుండా ఎంజాయ్‌ చేస్తున్నారు. ఓ వ్యక్తికి పాజిటివ్‌ వచ్చిందంటే భయపడిపోయి దూరం జరిగి శానిటైజర్‌ రాసేసుకుని ఆ వీధిలోకి ఆ బిల్డింగ్‌లోకి వెళ్లేందుకు భయపడిపోతాం అలాంటిది కొన్ని వందల మంది మన చుట్టే.. మనకు తెలియకుండా తిరిగేస్తున్నారు.

కరోనా సోకిన చాలామంది సైలెంట్‌గా బయట తిరిగేస్తూ.. వారి పనులను చక్కబెట్టుకుంటున్నారు..! దీంతో అది మరింత మందికి వ్యాప్తి చెందుతోంది. నిజానికి కరోనా లక్షణాలు ఉన్న వ్యక్తికి.. టెస్ట్‌ చేసేటప్పుడు.. ఆధార్‌తో పాటు ఫోన్‌ నెంబర్‌ తీసుకుంటారు. అడ్రస్‌ కనుక్కుంటారు..పాజిటివ్‌ వస్తే వెంటనే అతన్ని ట్రేస్‌ చేసి.. ఐసోలేషన్‌లో వేయాలి. ఇది వైరస్‌ను నియంత్రించే చర్యల్లో ఒకటి. కానీ ఇందులో కొందరు ఫేక్‌ అడ్రస్‌లతో వస్తున్నారు. కొందరు ఫోన్‌లు ఎత్తడం లేదు. ఇంకొందరు జాడే దొరకడం లేదు. దీంతో వారిని ట్రేస్‌ చేయడం కష్టంగా మారుతోంది. దీంతో ట్రేస్‌ దగ్గరే అసలు సమస్య ఏర్పడుతోంది. ఈ సూపర్‌స్ప్రెడర్స్‌ అంతా తిరిగి మళ్లీ ఇంటికి వస్తున్నారు. ఇలాంటి వాళ్లలో చాలా మంది లక్షణాలు లేని వాళ్లు ఉండొచ్చు కానీ వారి నుంచి ఎంత మందికి సోకుతుంది..ఎంత మందికి వైరస్‌ వ్యాప్తి చెందుతుంది అన్నది పట్టించుకోవడం లేదు.

టెస్ట్‌ చేయించుకోవడం పాజిటివ్‌ రాగానే పత్తా లేకుండా పోవడంతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఏపీ,తెలంగాణలో పెరుగుతున్న కేసులకు ఇది ఓ కారణంగా చెబుతున్నారు. కేసులు పెరిగినా కొద్దీ.. వారి ట్రేస్‌ చేసి టెస్ట్‌లు చేయడం.. ఐసోలేషన్‌కి పంపండం కష్టంగా మారింది. అందుకే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. కానీ బాధ్యత తెలియని ఇలాంటి సూపర్‌స్ప్రెడర్స్‌ అలా వైరస్‌ను అంటించుకుని పోతున్నారు. అకారణంగా అనేక మందిని పొట్టనపెట్టుకుంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here