Home News Stories

అదిగో టీకా…ఇదిగో తోక..

కరోనా వైరస్‌ ప్రపంచాన్ని భయపెట్టగానే దానికి విరుగుడు మంత్రం కోసం ప్రయత్నాలు కూడా మొదలయ్యాయి. వ్యాక్సిన్‌ కోసం దాదాపుగా అన్ని అభివృద్ధిచెందిన దేశాలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. లక్షలకోట్ల ఆదాయం తెచ్చిపెట్టే టీకాను ముందు తయారుచేసి మార్కెట్‌ ని క్యాప్చర్‌ చేసేందుకు ఎన్నో దేశాలు పోటీపడుతున్నాయి. ఇప్పటికే క్లినికల్‌ ట్రయల్స్‌ క్లైమాక్స్‌ దశకు వస్తున్నాయి. రేపోమాపో తమ వ్యాక్సిన్‌ వచ్చేస్తుందనే ప్రకటనలు వినిపిస్తున్నాయి. కొన్నిచోట్ల క్లినికల్‌ ట్రయల్స్ వికటిస్తున్నాయి. ప్రయోగాలు ఆగిపోతున్నాయి. ఆ టీకా ఎప్పుడొస్తుందో, భారత్‌ లాంటి అధిక జనాభా ఉన్న దేశాల్లో ప్రతీ ఒక్కరికీ వ్యాక్సిన్‌ అందించేందుకు ఎంత కాలం పడుతుందో ఇప్పటికీ అంచనాకు అందని విషయమే. అయితే వ్యాక్సిన్‌ వస్తే చాలు దాన్ని అందరికీ అందించేందుకు దేశాలు వేటికవి ప్రత్యేక ఏర్పాట్లు చేసుకుంటున్నాయి.

అమెరికా ఫార్మా దిగ్గజం ఫైజర్, జర్మన్ బయోటెక్ సంస్థ బయో‌ఎన్‌టెక్ సంయుక్తంగా కరోనా వైరస్ టీకా క్లినికల్ ట్రయల్స్ నిర్వహించాయి. తమ ప్రయోగాల్లో టీకా 90 శాతం సమర్ధంగా పనిచేసినట్టు ఫైజర్‌-బయో ఎన్‌ టెక్‌ ప్రకటించాయి. దాదాపు 40వేల మందితో క్లినికల్ ట్రయల్స్‌ జరిపితే… కేవలం 94 మంది మధ్యంతర ఫలితాలనే విడుదలచేసింది ఫైజర్. ఇంత తక్కువ నమూనాతో వ్యాక్సిన్‌ ఎంతవరకు సురక్షితమనే చర్చకు తెరలేచినా, సమర్ధత, భద్రతకు సంబంధించిన మరింత డేటాను రెండునెలల్లో ప్రకటించబోతోంది ఫైజర్. అంటే కొత్త సంవత్సరంలోనే ఆ టీకా వృద్ధులు, వైరస్‌ తీవ్రత ఎక్కువగా ఉండేవారిపై ఎంత ప్రభావవంతంగా పనిచేస్తుందో స్పష్టత రాబోతోంది. అయితే ఈలోపు అత్యవసర కేసుల్లో వ్యాక్సిన్‌ వినియోగానికి పర్మిషన్‌ కోసం యూఎస్ రెగ్యులేటరీకి దరఖాస్తు చేయబోతోంది ఫైజర్ కంపెనీ.

వ్యాక్సిన్ సక్సెస్‌ అయినా, వినియోగానికి గ్రీన్‌ సిగ్నల్‌ వచ్చినా ఈ ఏడాది కేవలం 50 మిలియన్ డోస్‌లు మాత్రమే అందుబాటులోకి వస్తాయనేది అంచనా. అమెరికా, బ్రిటన్, జపాన్ లాంటి దేశాలకు వ్యాక్సిన్‌ సరఫరా చేసేలా ఇప్పటికే అగ్రిమెంట్ చేసుకుంది ఫైజర్. అయితే మన దేశం మాత్రం ఫైజర్‌ తో ఇంకా ఎలాంటి ఒప్పందం చేసుకోలేదు. భారత్‌ లో టీకా అందుబాటులోకి తేవడానికి ముందు స్థానికంగా క్లినికల్ ట్రయల్స్ నిర్వహించాల్సి ఉంటుంది. టీకాను మైనస్ 70 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద భద్రత పరచాల్సి ఉంటుంది. అయితే మన దేశంలో అలాంటి స్టోరేజీ వసతులు లేవంటున్నారు వ్యాక్సిన్ ఎక్స్‌ పర్ట్స్‌ . సదుపాయాల సంగతెలా ఉన్నా వ్యాక్సిన్‌ కోసం ఫైజర్ సంస్థతో కేంద్రం సంప్రదింపులు జరుపుతోంది .

ప్రస్తుత పరిస్థితిని బట్టి ఈ ఏడాదిలో 50 మిలియన్ డోస్‌లు, వచ్చే ఏడాదికి 1.3 బిలియన్ డోసుల వ్యాక్సిన్‌ఉత్పత్తి చేయగలమని ఫైజర్‌ కంపెనీ అంచనావేస్తోంది. వ్యాక్సిన్ పూర్తిస్థాయిలో విజయవంతమైతే వివిధ దేశాల్లో సరఫరాకు ఒప్పందం చేసుకుంటామంటోంది. మరోవైపు.. ఫైజర్​-బయో ఎన్​టెక్​ సంయుక్తంగా అభివృద్ధి చేస్తున్న కరోనా వ్యాక్సిన్​ క్యాండిడేట్ ​ను కొనుగోలు చేయబోతోంది ఐరోపా సమాఖ్య. ఈ టీకా ​ అత్యంత మెరుగైన ఫలితాలను ఇస్తోందనే నమ్మకంతో ఉంది ఈయూ. యూరోపియన్‌ యూనియన్‌ దేశాల కోసం దాదాపు 30కోట్ల టీకా డోసులను కొనుగోలు చేయాలనేది టార్గెట్‌. దశల వారీగా టీకాలు అందజేసేలా ఈయూ కార్యాచరణ రూపొందించుకుంటోంది. మెడికల్‌ స్టాఫ్‌, పెద్ద వయసువారికి వ్యాక్సిన్‌ లో మొదటి ప్రాధాన్యం ఇవ్వబోతోంది.

కరోనా వ్యాక్సిన్‌ వ్యవహారంలో ఫైజర్‌ ఓ అడుగుముందుండగా… తమ దేశం ఇప్పటికే విడుదల చేసిన రెండు వ్యాక్సిన్లు​ సురక్షితంగా, సమర్థవంతంగా పనిచేస్తున్నాయని ప్రకటించారు రష్యా అధ్యక్షుడు పుతిన్‌. మూడో టీకా విడుదలకు రెడీ అవుతున్నట్లు ప్రకటించారు. రష్యాలో విడుదల అయిన రెండు వ్యాక్సిన్లు సురక్షితమని, ఎలాంటి దుష్ప్రభావాలు లేవని క్లినికల్​ ట్రయల్స్​ ఇప్పటికే ధ్రువీకరించాయి. దీంతో ప్రపంచ దేశాల్లో ముందుండేందుకు మూడో వ్యాక్సిన్​ రిలీజ్‌ కి రెడీ అవుతోంది రష్యా. వ్యాక్సిన్​పై రాజకీయాలు వద్దంటున్న రష్యా… ప్రపంచానికంతా అవసరమైన కరోనా వైరస్‌ టీకా విషయంలో…. ఏ దేశంతోనైనా కలిసి పనిచేసేందుకు సిద్ధమనే సంకేతాలిచ్చింది

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here