Home News

భారత్ లో నెలరోజుల పాటు లాక్ డౌన్ ?

భారత్ లో కరోనా చాలా స్పీడ్​గా వ్యాపిస్తోంది. దేశవ్యాప్తంగా గడిచిన ఐదునెలల్లోనే కోటి మంది వైరస్​ బారిన పడ్డారు.కరోనా సెకండ్ వేవ్ లో మహమ్మారి రూపు మార్చుకుని కొత్త వేరియంట్ల రూపంలో విరుచుకుపడుతుంది. ఇండియాలో అన్ని రాష్ట్రాల్లో భారీగా కేసులు నమోదవుతుండటంతో మరణాలు సంభవిస్తున్నాయి. మహమ్మారికి అడ్డుకట్ట వేయాలంటే మరిన్ని కఠిన చర్యలు..భారీ లాక్‌డౌన్‌ లాంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని తేల్చి చెప్తున్నారు నిపుణులు.

దేశంలో ప్రతీ రోజులు నాలుగు లక్షలకుపైగా కేసులు నమోదు అవుతున్నాయి. వేలల్లో మరణాలు నమోదు అవుతున్నాయి. కరోనా కట్టడికి పలు రాష్ట్రాలు లాక్​డౌన్​లు అమలు చేసేందుకే మొగ్గుచూపుతున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో కంప్లీట్​ లాక్​డౌన్​ అమలు చేస్తుండగా.. మరికొన్ని రాష్ట్రాల్లో కర్ఫ్యూ అమలు చేస్తున్నాయి. అయితే దేశవ్యాప్తంగా ఒక నెల రోజుల పాటు లాక్ డౌన్ విధించడం మాత్రమే కరోనా కేసులు తగ్గించేందుకు ప్రత్యామ్నాయంగా కనిపిస్తుంది. నిజానికి గతంలో లాక్ డౌన్ విధించినప్పుడు ప్రజలకు అస్సలు సమయం ఇవ్వకుండా లాక్ డౌన్ పెట్టి వలస జీవులను రోడ్డున పడేశారంటూ విమర్శించిన వారే ఇపుడు రివర్స్‌లో లాక్ డౌన్ విషయంలో కేంద్ర ధైర్యంగా నిర్ణయం తీసుకోవడం లేదని ఆరోపిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here