Home Health corona

ప్రమాదకరంగా మారిన కరోనా కొత్త వేరియంట్లు

కరోనా మహమ్మారి.. రూపు మార్చుకుని కొత్త వేరియంట్ల రూపంలో విరుచుకుపడే ప్రమాదం చాలా ఎక్కువగా ఉందని మార్చి మొదటివారంలోనే వైద్యనిపుణులు కేంద్రాన్ని హెచ్చరించారు. సెకండ్‌ వేవ్‌ ముప్పు భయంకరంగా ఉండబోతోందని, ప్రమాదం దిశగా వెళ్తున్నామని ఆందోళన వ్యక్తం చేశారు. కానీ కేంద్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో పెడచెవిన పెట్టిందని, హెచ్చరికలను పట్టించుకోలేదు..ఇప్పుడు మరిన్ని కొత్త వేరియంట్లు దేశంలో వ్యాపిస్తున్నాయని వాటి వల్ల దేశవ్యాప్తంగా కొవిడ్‌ కేసులు, మరణాలు భారీగా పెరిగిపోయే ప్రమాదం చాలా ఎక్కువగా ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

వైరస్‌ వ్యాప్తి ఎక్కువయ్యే కొద్దీ… ఎక్కువ ఉత్పరివర్తనాలు జరిగి కొత్త వేరియంట్లు పుట్టుకొచ్చే ప్రమాదం ఉందని అంటున్నారు సీసీఎంబీ డైరక్టర్ రాకేశ్ మిశ్రా. దీని ఫలితంగా అవి ఎక్కువగా వ్యాప్తి చెందే గుణాన్ని కలిగి ఉండడమే కాక, రోగనిరోధక శక్తికి లొంగవని కూడా ఊహించామని చెప్పారు. మొదటి దశలో వైరస్‌ సోకి యాంటీబాడీలు తయారైనవారికి కొత్త వేరియంట్లు సోకితే, అవి కూడా రోగ నిరోధక వ్యవస్థను దాటి ఇన్ఫెక్ట్‌ చేయడానికి ప్రయత్నిస్తాయని.. అలాంటి సందర్భాల్లో పుట్టే కొత్త వేరియంట్లు మరింత ప్రమాదకరంగా మారే ముప్పుందని అంటున్నారు రాకేశ్‌ మిశ్రా. ఇలాంటి విపత్కర సమయాల్లో ప్రజల ప్రాణాలను కాపాడడమే ప్రధానమన్నారు. కరోనా మహమ్మారికి అడ్డుకట్ట వేయాలంటే.. భారీ లాక్‌డౌన్‌ లాంటి కఠిన చర్యలు తీసుకోవాలంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here