Home Health corona

ప్రాణం తీస్తున్న కరోనా కొత్త వేరియంట్ ఇదే

దేశంలో ప్రాంతాల వారీగా రకరకలాల కరోనా వేరియంట్లు వ్యాప్తి చెందుతున్నాయి. ఉత్తరాదిలో ఒక రకం.. దక్షిణాదిలో మరో రకం వైరస్‌ ఎక్కువగా కనిపిస్తోంది. పశ్చిమ ప్రాంతంలో ఇంకో రకం ఉంది. ప్రస్తుతం కేసులు అధికంగా ఉన్న ఢిల్లీ, పంజాబ్‌, ఉత్తరప్రదేశ్‌, హరియాణాల్లో యూకే రకం వైరస్‌ ఎక్కువగా ఉంది. బి.1.617 వైరస్‌ కూడా కనిపిస్తోంది. ఇక మహారాష్ట్రలో డబుల్‌ మ్యూటెంట్‌ రకం విస్తృతి కనిపిస్తోంది.

బి.1.617 వేరియంట్‌లో ఒకటి, రెండు, మూడు రకాలు కూడా వ్యాప్తిలో ఉన్నాయి. బెంగాల్‌లో 20శాతం కేసుల్లో బి.1.618 వైరస్‌ కనిపిస్తోంది. పశ్చిమబెంగాల్‌లో 20శాతం కేసుల్లో బి.1.618 వైరస్‌ కనిపిస్తోంది. దక్షిణాదిలోని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, కేరళ, కర్ణాటకలో ఎన్‌-440కె రకం ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. ఇక్కడ డబుల్‌ మ్యూటెంట్‌ చాలా తక్కువగా ఉంది. కేసులు పెరిగేకొద్దీ కొత్త ఉత్పరివర్తనాలతో వైరస్‌ రకాలు పెరగడానికి అవకాశం ఉంది. పలు ప్రాంతాల్లో యూకే రకం, డబుల్‌ మ్యూటెంట్‌, ఎన్‌440కె రకం వైరస్‌లు బలంగా వ్యాప్తి చెందుతున్నాయి.

సగానికంటే ఎక్కువ కేసుల్లో పాత సాధారణ వైరస్‌ రకాలే ఉన్నాయి. అయినా ప్రతిచోటా కేసులు పెరుగుతున్నాయి. కొత్త మ్యూటెంట్ల వ్యాప్తి ఒక్కటే కేసుల పెరుగుదలకు కారణం కాదు. కొత్తవి వచ్చినప్పుడు సహజంగానే కొత్త సమస్యలు వస్తాయి. వ్యాప్తి తీవ్రత పెరిగే అవకాశం ఉంది. బి.1.617 వేరియంట్‌ కాస్త ప్రమాదకరంగా ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here