Home News Updates

షాకింగ్: హైదరాబాద్ మురుగు నీటి చెరువుల్లో కరోనా ఆనవాళ్లు

కరోనా సెకండ్‌ వేవ్‌ దేశాన్ని ఊపేస్తోంది. దీని నుంచి బతికి బట్టకట్టడమే కర్తవ్యంగా పోరాడుతున్నారు దేశ ప్రజలు. హైదరాబాద్‌లోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కెమికల్ టెక్నాలజీ శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనలో సంచలన విషయాలు బయటికొచ్చాయి. కరోనా సోకిన వారి నాసికా ద్రవాలు, నోటి మార్గాల ద్వారానే కాకుండా మలమూత్ర విసర్జన ద్వారా కూడా వైరస్‌ బహిర్గతవుతుందని, మురుగునీటి విశ్లేషణ ద్వారా కరోనా వ్యాప్తిని గుర్తించడానికి అవకాశం ఉంటుందని చెప్తున్నారు. ఐఐసీటీ శాస్త్రవేత్తలు హైదరాబాద్‌లోని తార్నాక, హెచ్‌ఎంటీనగర్‌, లాలాగూడ, నాచారం ప్రాంతాల్లో అధ్యయనం చేశారు.

మురుగునీటి విశ్లేషణతో కొవిడ్‌తో పాటు ఇతర వ్యాధుల వ్యాప్తిని ముందే గుర్తించి తగు చర్యలు తీసుకునేందుకు వీలు కలుగుతుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. యాంటిబయాటిక్స్‌ ఎక్కువగా ఏ ప్రాంతంలో వాడుతున్నారు…డ్రగ్‌ రెసిస్టెన్స్‌ యాంటిబయాటిక్స్‌ ఏవి వంటివి మురుగునీటి నమూనాలను పరీక్షించడం ద్వారా గుర్తించవచ్చని చెప్తున్నారు. మురుగు నీటితోపాటూ చెరువుల్లోనూ కరోనా ఆనవాళ్లపై పరిశోధనలు చేస్తున్నారు ఐఐసీటీ శాస్త్రవేత్తలు. నిజాంపేటతో పాటు మరో మూడు చెరువుల్లో నమూనాలను సేకరించి విశ్లేషించారు. మురుగునీరు చేరుతున్న చెరువుల్లో వైరస్‌ ఆనవాళ్లు కనిపించాయని, మురుగునీరు చేరని చెరువులో కన్పించలేదని వివరించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here