Home News Updates

బండ్ల గణేష్ కు కరోనా కాటు

పాపం బండ్ల గణేష్ .. ఇప్పుడు కొరోనా ఎఫెక్ట్ కొట్టింది .. ఏంటి బండ్ల గణేష్ కు కరోనా సోకింది అనుకుంటున్నారా… కాదండి బాబు… కాస్తో ఓపిక గా చదవండి.

నటుడు నిర్మాతగా బండ్ల గణేష్ చాలా ఫేమస్. రాజకీయాల్లో చేరి ‘7ఓ క్లాక్ బ్లేడ్ తో గొంతు కోసుకుంటానన్న ఆయన డైలాగ్’ చాలా పాపులర్. అలాంటి బండ్ల తర్వాత రాజకీయాలు వదిలి సినిమాల బాట మళ్లీ పట్టారు. అయితే నటుడిగా .,నిర్మాతగా బండ్ల గణేష్ ఉన్నప్పటికీ అయన ఆదాయ వనరు పౌల్ట్రీ ఫామ్స్.

తెలంగాణలో పెద్ద పౌల్ట్రీ పరిశ్రమ బండ్ల గణేష్ కు ఉంది. బండ్ల కుటుంబం ., అయన సోదరుడు కలిసి హైదరాబాద్ చుట్టు పక్కల పెద్ద ఎత్తున పౌల్ట్రీ ఫామ్స్ ఏర్పాటు చేశారు. తెలంగాణలోనే అత్యంత ఎక్కువ కోళ్లను ., గుడ్లను ఉత్పత్తి చేసే సంస్థగా వారి పౌల్ట్రీ ఫామ్స్ ఉన్నాయి.

ఇప్పుడు కరోనా దెబ్బకు బండ్ల గణేష్ కుదేలయ్యాడట.. చికెన్.,కోడి గుడ్లు తింటే కరోనా వస్తుందన్న ప్రచారం బండ్ల గణేష్ వ్యాపారాలపై తీవ్రంగా పడింది. దీంతో చికెన్ గుడ్లు మార్కెట్లో పడిపోయాయి. వాటికి డిమాండ్ లేకపోవడంతో ఇప్పుడు దాణా ఖర్చు పెరిగి భారీగా నష్టాలొస్తున్నాయట..

అందుకే తాజాగా కాపుకొచ్చిన 50వేల కోళ్లను పంపిణీ చేయడానికి బండ్ల గణేష్ రెడీ అయ్యారట..కోళ్లను కొనేవారు లేక పోవడంతో బండ్ల గణేష్ కు దాదాపు 10-20 లక్షల వరకూ నష్టం వస్తోందట.. సమీప గ్రామాల ప్రజలకు ఇప్పుడు ఉచితం గా కోళ్ల పంపిణీ కి బండ్ల రెడీ అయ్యారట.. పాపం కరోనా వైరస్ ఎఫెక్ట్ తో బండ్ల గణేష్ కు కూడా భారీగా బొక్క పడుతోందనే చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here