Home Health corona

ఓల్డ్ సిటీలో తగ్గిన కరోనా కేసులు..అసలు సీక్రేట్ ఇదేనట

కరోనా సెకండ్ వేవ్‌తో దేశంతో తెలంగాణలో కుప్పలు తెప్పలుగా కేసులు నమోదవుతుంటే హైదరాబాద్ పాతబస్తీలో మాత్రం పాజిటివిటి రేటు చాలా తక్కువగా ఉంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఇబ్బుడుముబ్బిడిగా కేసులు నమోదవుతున్నా పాతబస్తీలో మాత్రం పాజిటివిటి రేటు 10 శాతం మాత్రమే ఉంది.ఓల్డ్ సిటీ పరిధిలో పలు పీహెచ్ సీలలో వేల సంఖ్యలో కరోనా టెస్టులు చేస్తున్నా సగటున 100 మందికి కేవలం 10మందికి మాత్రం పాజిటివ్ వస్తున్నట్లు తెలిసింది.

పాతబస్తీలో కీలక ప్రాంతాలైన అజాంపుర, యాకుత్‌పుర లో ఒక్క పర్సంట్ కూడా కేసులు నమోదవ్వలేదు. పాతబస్తీ కి ఇతర ప్రాంతాల నుంచి వలసలు తగ్గడం రంజాన్ సమయంలో బలవర్దకమన హలీం తినడంతో రోగ నిరోధకశక్తి పెరిగినట్లు తెలుస్తుంది. సుగంధ ద్రవ్యాలతో చేసిన హలీం ద్వారా రోగనిరోధకశక్తి పెరిగినట్లు తెలుస్తుంది.ఈ ప్రాంతాల్లో డ్రైఫ్రూట్స్ వినియోగం కూడా ఎక్కువ ఉండటం మరో కారణంగా తెలుస్తుంది. రంజాన్ మాసం కావడంతో పారిశుద్య పనులు కూడా ఓల్డ్ సిటీలో ముమ్మరంగా నిర్వహిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here