Home News Updates

కరోనా కేరాఫ్ కర్ణాటక…… బీ కేర్ఫుల్ తెలుగు స్టేట్స్

కర్ణాటక విషయం లో జరా జాగ్రత్త . ఎందుకంటే అక్కడి నుంచే మన తెలుగు రాష్ట్రాల లోకి కరోనా కేసులు తరలి వచ్చాయి . ఒకటి కాదు రెండు కేసులు వచ్చాయి … ఇది చాలదన్నట్లు నమోదైన ఒక కరోనా మరణం కూడా కర్ణాటక కు చెందినదే . కర్ణాటక లోని కలబుర్గి కి చెందిన ఒక వ్యక్తి మరణించాడు …

హైదరాబాద్ లో మరణించిన కర్ణాటక పెద్ద మనిషికి కరోనా పాజిటివ్ అన్న విషయాన్ని అధికారికంగా ప్రకటించటం ఒక ఎత్తు అయితే.. అతగాడి మరణం తర్వాత.. తనకు ఎదురైన అనారోగ్యానికి చికిత్స కోసం హైదరాబాద్ లోని దాదాపు మూడు.. నాలుగు కార్పొరేట్ ఆసుపత్రుల్ని సందర్శించిన వైనం తాజాగా బయటకు వచ్చింది. తనకు ఎదురైన అనారోగ్యానికి చికిత్స కోసం హైదరాబాద్ మహా నగరంలోని కొన్ని ప్రముఖ కార్పొరేట్ ఆసుపత్రులకు వెళ్లినట్లుగా సమాచారం.

తాజాగా ఆయన మృతి నేపథ్యంలో.. ఆయన ఎక్కడెక్కడ.. ఎవరెవరిని కలిశారు? ఆ సందర్భంలో వారు ఏమైనా కరోనా ఎఫెక్ట్ కు లోనయ్యారా? వారి పరిస్థితి ఇప్పుడెలా ఉందన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. కరోనా పాజిటివ్ రోగులు.. బయటకు రాకూడదు. వచ్చినా ఎవరితోనూ నేరుగా కలవకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది. అలాంటిది సదరు పెద్దాయన తన కు వచ్చిన కరోనా గురించి తెలీక.. పలు ఆసుపత్రుల కు వెళ్లిన నేపథ్యంలో.. ఆ సందర్భంగా ఆయనకు కాంటాక్ట్ అయిన జనం ., డాక్టర్స్ వివరాలు ., అయన ప్రయాణించిన వాహనాలు వివరాలు
ఇప్పుడు ఆందోళనకరంగా మారాయి. ఈ విషయం హైదరాబాదీయుల గుండెల్లో కొత్త గుబులకు కారణమవుతుందని చెప్పక తప్పదు. అంతే కాదు ఇతర దేశాల నుంచి వస్తున్న చాలా మంది బెంగుళూరు కు వచ్చి అక్కడి నుంచి తెలుగు రాష్ట్రాలలోకి ప్రవేశిస్తున్నట్లు తెలుస్తోంది …కాబట్టి కర్ణాటక ., బెంగుళూరు విషయంలో కాస్త జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది.

మరో వైపు బెంగళూరు లో మరో కేసు నమోదైంది. గూగుల్ ఉద్యోగికి కరోనా పాజిటివ్ సోకింది. అతడిని ప్రత్యేకంగా ఐసోలేషన్ వార్డులో ఉంచి చికిత్స చేస్తున్నారు.దీనితో గూగుల్ ఉద్యోగులంతా వెంటనే ఇంటికి వెళ్లిపోవాలని ఆదేశిస్తూ వర్క్ ఫ్రం హోమ్ అనుమతులు మంజూరు చేస్తూ గూగుల్ బెంగళూరు యాజమాన్యం ఆదేశాలు జారీ చేసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here