Home Health corona

కరోనా వచ్చి పెద్దగా లక్షణాలు లేనప్పుడు ఏం చేయాలి ?

కరోనా పాజిటివ్‌ వచ్చి పెద్దగా లక్షణాలు లేని వారు ఏం చేయాలి..ఎలాంటి మెడిసిన్ వాడలి ఇది ఇప్పుడు చాలా మందిలో ఉన్న కన్ఫ్యూజన్. కరోనా పాజిటివ్ వచ్చినా తక్కువ లక్షణాలతో ఉన్నవారు ఎలాంటి భయం లేకుండా.. పౌష్టికాహారం తీసుకోవాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా విటమిన్లు అధికంగా ఉండే పండ్లు, డ్రైఫ్రూట్స్‌, మాంసం తదితర వ్యాధి నిరోధకశక్తిని పెంచే ఆహారం తీసుకోవాల్సి చెబుతున్నారు కరోనా స్పెషలిస్ట్ డాక్టర్లు. కానీ కరోనా సోకింది ఏం అయిపోతుందో అనే భయాన్ని మాత్రం దరిచేరనివ్వకూడదు అంటున్నారు.

ఆయాసం, దగ్గు, జలుబు, జ్వరం లక్షణాలు కనిపించిన వెంటనే ఇతరులకు దూరంగా ఉండాలి అంటున్నారు వైద్యులు. పరీక్షల్లో పాజిటివ్‌ ఫలితం వచ్చి.. కరోనా లక్షణాలు బయటకు కనిపించని వారు సౌకర్యం ఉంటే కచ్చింతగా హోం ఐసొలేషన్ లో ఉండాలి అంటున్నారు. వారి నివాసంలో ప్రత్యేక గది, మరుగుదొడ్డి ఉండాలంటున్నారు. ఇళ్లలో చిన్నపిల్లలు, వృద్ధులు, దీర్ఘకాలిక వ్యా ధులతో బాధపడుతున్న వారు ఉంటే మరిన్నిజాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here