Home Women Health

ఏపీలో కరోనా యాంటిబాడీ కాక్ టెయిల్ ప్రయోగం

ఏపీలో కరోనాకి తొలి మోనోక్లోనల్ యాంటిబాడీ కాక్ టెయిల్ ఇంజెక్షన్ ప్రయోగం వినియోగించారు. విజయవాడ ఆయుష్ హాస్పటల్ లో కరోనా చికిత్సలో భాగంగా తొలి ఇంజెక్షన్ వినియోగించారు. ఈ కాక్‌ టెయిల్ ను సెలైన్ ద్వారా అర్ధగంట వ్యవదిలో బాదితుడికి ఎక్కించారు. మరో అరగంటలో కరోనా బాదితుడిని ఇంటికి పంపించారు ఆయుష్ వైద్యులు. కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిన తరువాత ఎంత త్వరగా ఈ మందు వాడితే అంతటి చక్కని ఫలితాలు ఉంటాయటున్నారు వైద్యులు.

ఈ యాంటిబాడీ కాక్ టెయిల్ మందు ల్యాబ్ లో తయారు చేసిన యాంటిబాడీ, ప్రొటీన్ యోక్క సమ్మెళనం. ఇది కరోనా వైరస్ మీద ఉండే స్పైక్ ప్రొటీన్ ని నిరోదించడం ద్వారా వైరస్ కణాలను ఎదుర్కుంటుంది. మానవ కణాల మీద వైరస్ ప్రభావం చూపకుండా అడ్డుపడుతుంది. ఈ ఇంజెక్షన్ ఆక్సిజన్ శాచురేషన్ తగ్గిపోవడానికి ముందు మాత్రమే ఉపయోగించాలి అని డాక్టర్లు తెలిపారు. 12 సంవత్సరాల వయసు నుంచి 65 ఏళ్ళ వయసు పైబడిన వారు కూడా ఈ కాక్ టెయిల్ వాడవచ్చు. ఆలాగే కిడ్నీ సమస్యలు కంట్రోల్ లేని షుగర్ వ్యాది మొదలైన వారికి ఈ యాంటిబాడి ఇంజెక్షన్ కరోనా వ్యాది ప్రమాదాన్ని గణనీయంగా తగ్గిస్తుందని ఆయుష్ వైద్యులు తెలిపారు. ఈ యాంటి బాడీ మిశ్రమాన్ని పేషెంట్ రక్తనాళం ద్వారా సెలైన్ లో కలిపి రోగి శరీరంలోకి ఎక్కిస్తారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here