Home Women Health

చల్లని పెరుగు ఆరోగ్యానికి మెరుగు

చల్లని పెరుగు ఆరోగ్యానికి మెరుగు

పెరుగు అంటే చాలామంది దూరం పెడుతుంటారు. అయితే ఆరోగ్యానికి పెరుగు చేసే మేలు అంతా ఇంతా కాదు. సుమారు 4,500 సంవత్సరాల నుంచి ప్రజలు పెరుగును తయారుచేసి తింటున్నారు.నేడు ఇది ప్రపంచవ్యాప్తంగా ఒక సాధారణ ఆహారపదార్ధం.

ఇది ప్రత్యేక ఆరోగ్యప్రయోజనాలున్న ఒక పోషకాహారం.ఇది ప్రోటీన్, కాల్షియం, రిబోఫ్లావిన్, విటమిన్ B6 మరియు విటమిన్ B12 వంటి పోషకాలను కలిగి ఉంది. పెరుగును యోగర్ట్ అని అంటారు. కొవ్వు తక్కువగా ఉండే పెరుగు లో లాక్తోబసిల్లై అధికం గా ఉంటాయి,ఇవి మన పేగుల్లో సహజము గా ఉండే సూక్ష్మ జీవులు. ఇవి ప్రమాదకర బాక్టీరియాను సంహరిస్తాయి. పెరుగు కొలెస్టరాల్ ను తగ్గిస్తుంది.

పాలలో కన్నా పుల్లటి పెరుగు లో కాల్సిం శతం ఎక్కువ. కప్పు(250ఎంజీ) పెరుగు లో370 mg కాల్సిం ఉంటుంది. విటమిన్ బి, పాస్ఫరస్, పొటాసియం, మాంసకృత్తులు ఎక్కువగా ఉంటాయి.పుల్ల పెరుగు అరటిపండు తో కలిపి తింటే కడుపులో మంట తగ్గుతుంది.పుల్లటి పెరుగు మజ్జిగలా చేసి జీలకర్ర, కరివేపాకు, చిటికెడు శొంఠి చేర్చి తీసుకుంటే వాంతి, డయేరియా తగ్గుతాయి. పెరుగు రక్తపోటును తగ్గిస్తుంది.

కొంతమందికి కమ్మని పెరుగు లేనిదే భోజనం సంపూర్ణం అయినట్టు అనిపించదు. క్రమం తప్పని ఈ పెరుగు వాడకమే బరువు తగ్గడానికి భేషైన మార్గం. పెరుగుకి శరీర జీవక్రియలని చురుగ్గా ఉంచే శక్తి ఉందని అధ్యయనాల్లో తేలింది. రోజులో మూడు పూట్లా పెరుగు తినేవారు.శరీరంలో పేరుకొన్న కొవ్వు నిల్వలని అరవై శాతానికిపైగా తగ్గించుకోవడానికి అవకాశాలున్నాయి. అంతేకాదు పొట్ట చుట్టూ ఉండే కొవ్వుని ఎనభై శాతం తగ్గించి నాజూగ్గా ఉండేందుకు సహకరిస్తుంది. అందుకే పెరుగు వాడకాన్ని పెంచండి. పొట్టచుట్టూ కొవ్వు పేరుకుపోతే ఉదయంపూట పెరుగు వాడుతూ ఉండాలి.

చర్మ కాంతిని మరింత మెరుగుపర్చే పెరుగు
ముఖాన్ని కాంతివంతంగా మార్చుకోవడం కోసం తరచూ బ్యూటీ పార్లర్లకు పరుగెత్తాల్సిన పని లేదు. వంటింట్లో దొరికే వస్తువులతో ప్రయత్నిస్తే చాలు. డబ్బుకి డబ్బు మిగులుతుంది. శ్రమలేకుండా నలుగురూ మెచ్చే అందం మీ సొంతం అవుతుంది.

క్లెన్సర్‌: పచ్చి పాలలో దూదిని ముంచి ముఖాన్ని తుడుచుకుంటే మురికి వదిలిపోతుంది. తరచూ చేస్తుంటే చర్మం నునుపు దేలుతుంది. మీలో ఎంతో మార్పు కనిపిస్తుంది.

మాయిశ్చరైజర్‌: ఒక టీ స్పూను నారింజ రసం, ఒక టీ స్పూను నిమ్మరసం, ఒక కప్పు పెరుగు కలిపి పేస్టులా చేయండి. దీనిని ముఖానికి రాసుకుని పదిహేను నిమిషాల తరవాత తడి టిష్యూతో తుడిచేసుకోండి. పొడి చర్మం తేమగా మారడంతో పాటు, చర్మ కాంతి కూడా పెరుగుతుంది.

ప్రొటీన్‌ మాస్క్‌: టేబుల్‌ స్పూను మినప్పప్పునీ, ఐదారు బాదం పప్పుల్నీ రాత్రి నానబెట్టి ఉదయం వాటిని పేస్టులా చేసి ముఖానికి రాసుకోండి. గంట తరువాత కడిగేసుకుంటే చర్మానికి కావాల్సిన పోషకాలు అందుతాయి.

కండిషనర్‌: ఒక టేబుల్‌ స్పూను తేనెకి, రెండు టీ స్పూన్ల మీగడని కలిపి ముఖానికీ, మెడకీ రాసుకుని కొన్ని నిమిషాల తరవాత కడిగేసుకోండి.

సన్‌స్క్రీన్‌ లోషన్‌: కీరదోస రసం, గ్లిజరిన్‌, రోజ్‌ వాటర్‌ కలిపి ఒక డబ్బాలో వేసి ఫ్రిజ్‌లో దాచుకోండి. ఇంట్లోంచి బయటికి వెళ్లడానికి అరగంట ముందు ఇది ముఖానికి రాసుకుంటే సన్‌స్క్రీన్‌ లోషన్‌లా పనిచేస్తుంది. దీనివల్ల ఎండ ప్రభావం ఎక్కువగా ఇబ్బంది కలిగించదు.

పెరుగుతో లాభాలెన్నో..ప్రయత్నం చేసి చూడండి
చాలామందికి మంచి కూర, పచ్చడి, సాంబారు. ఎన్ని వేసుకుని తిన్నా చివరలో పెరుగన్నం తినకపోతే భోజనం చేసినట్లే అనిపించదు. అంతగా మన దైనందిన ఆహారంలో భాగంగా మారింది పెరుగు. అన్నంలో కలిపి తింటారా. లేదా విడిగా తింటారా. అది మీ ఇష్టం. కానీ కచ్చితంగా రోజుకి రెండుసార్లయినా పెరుగు తినాల్సిందే అంటున్నారు పోషకాహార నిపుణులు. తెలిసో తెలియకో మనం పెరుగన్నం తింటూనే ఉంటాం. కానీ బరువు తగ్గాలనో నిద్ర వస్తుందనో ఈమధ్య చాలామంది మానేస్తున్నారు. కానీ రోజూ పెరుగు తినేవాళ్లకి బీపీ వచ్చే అవకాశం తక్కువ అన్నది శాస్త్రవేత్తల పరిశీలన. బల్గేరియన్లూ రష్యాల్లోని స్టెప్పీలూ పెరుగు బాగా తినడంవల్లే ఎక్కువకాలం ఆరోగ్యంగా జీవిస్తున్నారని పారిస్‌ నిపుణులు అంటున్నారు.

మంచి ఆరోగ్యానికి పెరుగు
పాలల్లో పోషకాల సంఖ్య ఎక్కువే. అయితే అందులోని లాక్టోజ్‌ను అంతా అరిగించుకోలేరు. అదే పెరుగయితే ఆ సమస్య ఉండదు. మలబద్ధకం, డయేరియా, పేగు క్యాన్సర్‌, మొలలు. వంటి వ్యాధులు రాకుండా కాపాడుతుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

పెరుగులో లాక్టో బాసిల్లస్‌, స్ట్రెప్టోకాకస్‌. అనే భిన్న జాతులకు చెందిన ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా ఉంటాయి. ఈ బ్యాక్టీరియా లాక్టోజ్‌ చక్కెరను లాక్టిక్‌ ఆమ్లంగా మార్చడం ద్వారా పాలల్లోని ఆమ్లశాతాన్ని తగ్గిస్తాయి. ఫలితంగా పాలల్లోని ప్రొటీన్లు అమైనోఆమ్లాలుగా మారి గడ్డకడతాయి. అదే సమయంలో ఈ బ్యాక్టీరియా కాస్త పులిసేలా చేస్తుంది. మంచి ఆరోగ్యానికి పెరుగుకు మించింది లేదనే చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here