Home News Updates

అయోధ్యపై వివాదాస్పద వ్యాఖ్యలు

జగిత్యాలలో జరిగిన గొర్రెల పంపిణీ కార్యక్రమంలో కోరుట్ల ఎమ్మెల్యే వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. అయోధ్య రామమందిర నిర్మాణంపై తెరాస ఎమ్మెల్యే వివాదాస్పద వాక్యలు చేశారు. అయోధ్య రామాలయానికి ఏవరూకూడ విరాళాలు ఇవ్వకూడదని కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు చెప్పారు.

మన ఊర్లో రామాలయం ఉన్నాక అయోధ్య రామాలయానికి చందాలు ఎందుకివ్వాలని ఎమ్మెల్యే కామెంట్ చేశారు. ఉత్తర ప్రదేశ్ రాములోరి పేరుతో బీజేపీ నేతలు బిచ్చమెత్తుకుంటున్నారని అన్నారు. బొట్టు పెట్టుకుంటేనే రామభక్తులా..? తాము కూడా శ్రీరామ భక్తులమేనని చెప్పుకొచ్చారు. ఏది ఎమైనప్పటికి కోరుట్ల ఎమ్మెల్యే ఈవ్యాఖ్యలు చేయడం ఇప్పుడు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here