Home News

ఈటల పై కాంగ్రెస్ వైఖరి టీఆర్ఎస్ కే మేలు చేస్తుందా ?

టీఆర్‌ఎస్ లో ఏర్పడిన మాజీ మంత్రి ఈటల వివాదం కాంగ్రెస్ నేత విమర్షలతో కొత్త మలుపు తిరిగుతుంది. మంత్రి వర్గం నుంచి తప్పించి ఈటలకు అన్యాయం చేశారంటూ కొందరు నేతలు మాట్లాడుతున్నా కాంగ్రెస్ నేత హుజురాబాద్ కాంగ్రెస్ ఇంచార్జ్ కౌశిక్ రెడ్డి విమర్శలు మాత్రం టీఆర్ఎస్ కి మేలు చేసేలా ఉన్నాయన్న చర్చ నడుస్తుంది. దీంతో ఈటల ఎపిసోడ్‌లో కాంగ్రెస్‌ వైఖరి ఏంటన్నది స్పష్టత ఇవ్వాలని పార్టీకి చెందిన పలువురు నేతలు ఉత్తమ్‌ను కోరుతున్నారు.

కౌశిక్ రెడ్డికి ఉత్తమ్ తో సన్నిహిత సంబాంధాలు బంధుత్వం ఉంది. దీంతో ఉత్తమ్ మాత్రమే కౌశిక్ రెడ్డిని సైలెంట్ చేయ్యగలరన్న అభిప్రాయం పార్టీలో వినిపిస్తుంది. తాజాగా టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు పొన్నం ప్రభాకర్‌ సైతం ఇదే విషయమై ఉత్తమ్‌కు ఇదే సూచన చేశారు. అభిప్రాయపడ్డారు. కాంగ్రేస్ కే చెందిన కొందరు టీఆర్‌ఎస్‌ అజెండాను మీడియా ముందు మాట్లాడుతున్నారని ఉత్తమ్‌కు ఫిర్యాదు చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here