Home News

తెలంగాణ కాంగ్రెస్ ఆనందపడాల్సింది ఈ ఒక్కటి చూసుకునేనా

తెలంగాణలో కాంగ్రెస్ అనుకున్నదొక్కటి…అయింది ఇంకొక్కటి. గెలచి తీరుతామనుకున్న సాగర్ ఉపఎన్నికలో గతం కంటే ఎక్కువ మెజార్టీతో పరాజయం పాలైంది. అన్ని అస్త్రాలను ప్రయోగించి ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్ నేతలకు గట్టి షాక్ తగిలింది. అయితే ఇంత దయనీయ పరిస్థితిలోనూ టీ కాంగ్రెస్ మాత్రం ఒక విషయంలో సంతోషపడుతుంది.

నాగార్జున సాగర్‌లో పరిస్థితి తల్లకిందులైంది. తప్పకుండా విజయాన్ని సాధిస్తాం అనుకున్న కాంగ్రెస్‌కు చుక్కెదురు కావడంతో మింగుడుపడడం లేదు. జానారెడ్డి పెద్దరికం అయినా పార్టీని నిలబెడుతుందని అంతా భావించగా. అది దక్కకుండా పోయింది. అయితే… ప్రభుత్వం మరో మూడేళ్లు ఉంటుంది కాబట్టి… ప్రజలు టీఆరెస్‌వైపు మొగ్గు చూపి ఉంటారని సర్ది చెప్పుకుంది హస్తం పార్టీ. కానీ కాంగ్రెస్‌కు, జానారెడ్డి కి… నాగార్జునసాగర్ ఉప ఎన్నిక కొంత ఎదురు దెబ్బే అని చెప్పక తప్పదు.

సాగర్ ఎన్నికల్లో కాంగ్రెస్ అన్ని అస్త్రాల్నీ ప్రయోగించింది. జానారెడ్డికి ఇదే ఆఖరి ఎన్నిక అని చెప్పారు. 2023లో సీఎం అభ్యర్ధి ఆయనేనన్నారు. కానీ పార్టీ లెక్కలు తప్పాయి. నాయకత్వం మొత్తాన్ని ఇక్కడ ప్రచారంలో మోహరించినా ఫలితం లేకపోయింది. జానారెడ్డి సొంత మండలంలో కూడా టీఆర్ఎస్ ను కట్టడి చేయడంలో విఫలమయ్యారు. ఇక ఇతర నేతలు ఇంఛార్జులుగా ఉన్న మండలాల్లోనూ కారు హవానే కొనసాగింది. అంతా కలిసికట్టుగా వెళ్లినా పోల్‌ మేనేజ్‌మెంట్‌లో అధికారపార్టీ ముందు నిలబడలేకపోయామని ఫిక్స్‌ అయ్యారు.

ఇక కాంగ్రెస్ సంతోషపడే విషయం ఏదన్న ఉందంటే అది బీజేపీ కి వచ్చిన ఓట్ల శాతం. రాష్ట్రంలో తామే బలమైన ప్రతిపక్షం అని చెప్పుకుందామని చూసిన బీజేపీకి కనీసం డిపాజిట్‌ కూడా దక్కకపోవడంతో కొంత ఊపిరి పీల్చుకుంది టీ కాంగ్రెస్‌. సాగర్ బైపోల్‌లోనూ కనీసం 5 శాతం ఓట్లను కూడా సాదించలేక పోయింది. కేవలం 7 వేల 676 ఓట్లు మాత్రమే బీజేపీకి పోలయ్యాయి. అధికార టీఆర్ఎస్ ని తట్టుకుని ముందు ముందు కాంగ్రెస్‌ ఎలా నిలదొక్కుకుంటుందన్నది చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here