Home News Politics

హస్తం పార్టీ ఫస్ట్ లిస్ట్ రెడీ…

రెండు వారాల సుదీర్ఘ కసరత్తు అనేక తర్జనభర్జనల మధ్య మార్పులు చేర్పులతో మొత్తానికి కాంగ్రెస్ తోలి జాబితా రిలీజైంది. తెలంగాణ విషయంలో హస్తం పార్టీ ఇంకా అర్దరాత్రి సెంటిమెంట్ కొనసాగిస్తున్నట్లుంది. మహాకూటమిగా ఒకే వేదిక నుంచి జాబితాలను ప్రకటించాలని అనుకున్నా కాంగ్రెస్‌ సొంతంగానే 65 మందితో ఫస్ట్ లిస్ట్ రిలీజ్ చేసింది. టీడీపీ కూడ 9 మంది పేర్లతో తొలి జాబితా ప్రకటించడంతో తెలంగాణ ఎన్నికల్లో ఒక్కసారిగా వేడి పుట్టింది.

కాంగ్రెస్ జాబితాలో కులసమీకరణలు చూస్తే 23 మంది రెడ్లు, 13 మంది బీసీలు,ముగ్గురు వెలమలకు సీట్లు దక్కాయి. 65 మందిలో ఎక్కువగా 23 మంది రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారు. అందులో ఎక్కువ మంది నల్గొండ జిల్లా వారే కావడం గమనార్హం. 10 మంది మహిళలకు అవకాశమిచ్చారు. నలుగురు ఆదివాసీలు.. ఇద్దరు లంబాడాలకు పార్టీలోనే కొనసాగిన సిట్టింగులందరికీ టికెట్లు దక్కాయి.

మొదట 74 మందితో కాంగ్రెస్‌ తొలి జాబితాను సిద్ధం చేసినప్పటికీ రాహుల్‌గాంధీ నిర్దేశించిన మూడు ప్రాతిపదికలను పాటించలేదని ఫిర్యాదులు రావడంతో జాబితాను మరోసారి సమీక్షించారు. రాత్రి 11 గంటల వరకూ ఉత్తమ్‌, కుంతియా, స్ర్కీనింగ్‌ కమిటీ సభ్యులు కూర్చొని భారీ తేడాతో ఓడిన వారు, గతంలో కాంగ్రెస్ రెబల్స్‌గా పోటీ చేసిన వారు, ఇటీవలే పార్టీలో చేరిన వారిని ప్రస్తుతానికి పక్కనబెట్టారు. దాంతో తొలి జాబితా 74 నుంచి 65కు తగ్గింది. అనంతరం రాహుల్‌ ఆమోదంతో విడుదల చేశారు. పొన్నాల లక్ష్మయ్య, శశిధర్‌రెడ్డి తప్ప దాదాపు కాంగ్రెస్‌ పెద్దలందరికీ టికెట్లు దక్కాయి.

పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌, పద్మావతి దంపతులు ఎప్పట్లాగే హుజూర్‌నగర్‌, కోదాడల నుంచి పోటీ చేస్తున్నారు. ఒకే కుటుంబం అయినా సిట్టింగ్‌ ఎమ్మెల్యేలుగా వారిని పరిగణనలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. వారి దగ్గరి బంధువైన కౌశిక్‌రెడ్డి హుజూరాబాద్‌ నుంచి టికెట్‌ ఆశిస్తుండగా దాన్ని పెండింగులో పెట్టారు. కోమటిరెడ్డి సోదరులకు నల్గొండ, మునుగోడుల నుంచి అవకాశమిచ్చారు. పక్కనే నకిరేకల్‌ నుంచి అధిష్ఠానం హామీ ఇచ్చిన ఇంటి పార్టీని కాదని కోమరెడ్డి సోదరులు పట్టుబట్టిన చిరుమర్తి లింగయ్యకే అవకాశం ఇచ్చారు. మహేశ్వరం నుంచి సబితకు టికెట్‌ ఇచ్చినా, రాజేంద్రనగర్‌ నుంచి టికెట్‌ ఆశించిన కార్తీక్‌రెడ్డిను పెండింగులో పెట్టారు. రేవంత్‌రెడ్డితో పాటు ఆయన వెంట టీడీపీ నుంచి వచ్చిన నేతల్లో ముగ్గురికి టికెట్లు దక్కాయి. కాంగ్రెస్‌, సీపీఐ, టీడీపీలకు ప్రతిష్ఠాత్మకంగా మారిన కొత్తగూడెం సీటు నుంచి తానే పోటీ చేయాలని కాంగ్రెస్‌ నిర్ణయించుకుంది. వనమా వెంకటేశ్వర్‌రావును నిలబెట్టింది.

ఇక్కడ సీపీఐ నేత కూనంనేని సాంబశివరావును బరిలో దింపి ఫ్రెండ్లీ ఫైట్‌ చేయడానికి అంగీకారం కుదిరినట్లు తెలుస్తోంది. పార్లమెంటులో తెలంగాణ బిల్లు పెట్టినపుడు దాన్ని కాపాడుకొనేందుకు ఎంపీలుగా గట్టి పోరాటం చేసిన పొన్నం ప్రభాకర్‌, రాజగోపాల్‌రెడ్డి, బలరాం నాయక్‌, సర్వే సత్యనారాయణలకు కాంగ్రెస్‌ ఈసారి ఎమ్మెల్యే బరిలో దిగే అవకాశం ఇచ్చింది. కరీంనగర్‌, మునుగోడు, మహబూబాబాద్‌, కంటోన్మెంట్లలో వారు పోటీ చేస్తున్నారు. ములుగు నుంచి సీతక్క, వీరయ్యలు పోటీ పడగా, అక్కడ సీతక్కకు అవకాశమిచ్చి వీరయ్యను భద్రాచలానికి మార్చారు. పెండింగులో ఉన్న పొన్నాల సీటు జనగాం నుంచి కోదండరాం, కొమ్మూరు ప్రతా్‌పరెడ్డిలలో ఒకరు పోటీ చేస్తారని భావిస్తున్నారు.

పీజేఆర్‌ తనయుడు విష్ణు ఖైరతాబాద్‌ నుంచి టికెట్‌ ఆశిస్తుండగా పెండింగులో పడింది. కొమిరెడ్డి రాములు ఆశిస్తున్న కోరుట్ల నుంచి పైనుంచి ఊడిపడ్డ నేతను చేర్చడంతో రాహుల్‌ ఆదేశం మేరకు పెండింగులో పెట్టారు. అద్దంకి దయాకర్‌ ఆశిస్తున్న తుంగతుర్తిని, ఇద్దరు నాయక్‌లు పోటీ పడుతున్న దేవరకొండను, గండ్ర వెంకట రమణారెడ్డి ఆశిస్తున్న భూపాలపల్లిని పెండింగులో పెట్టడం గమనార్హం. పార్టీలో చేరి మూడు నెలలు కూడా గడవని వారికీ టికెట్లు దక్కాయి. చెన్నూరులో ప్రకటించిన బి.వెంకటేష్‌ నేత, తాండూరులో పైలట్‌ రోహిత్‌రెడ్డి, పరకాలలో కొండా సురేఖలకు దక్కాయి. పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్సీలు.. షబ్బీర్‌అలీ, ఆకుల లలిత, రాజగోపాల్‌రెడ్డిల పేర్లు తొలి జాబితాలో ఉన్నాయి. కమ్మ సామాజిక వర్గం నుంచి తొలి జాబితాలో ఒక్కరికి కూడా సీటు దక్కలేదు.

అభ్యర్థుల తొలి జాబితా..

సిర్పూర్- పాల్వాయి హరీశ్ బాబు
చెన్నూరు- వెంకటేశ్ నేత బోర్లకుంట
మంచిర్యాల- కొక్కిరాల ప్రేమ సాగర్ రావు
ఆసిఫాబాద్- ఆత్రం సక్కు
ఆదిలాబాద్- సుజాత గండ్రత్
నిర్మల్- అల్లేటి మహేశ్వర్ రెడ్డి
ముదోల్- రామారావు పటేల్ పవార్
ఆర్మూర్- ఆకుల లలిత
బోధన్- పి. సుదర్శన్ రెడ్డి
జుక్కల్- ఎస్. గంగారం
బాన్సువాడ- కాసుల బాలరాజు
కామారెడ్డి- షబ్బీర్ అలీ
జగిత్యాల- జీవన్ రెడ్డి
రామగుండం- ఎమ్మెస్ రాజ్‌ఠాకూర్
మంథని- శ్రీధర్ బాబు దుద్దిల్ల
పెద్దపల్లి- సి. విజయ రమణారావు
కరీంనగర్- పొన్నం ప్రభాకర్
చొప్పదండి- మేడిపల్లి సత్యం
వేములవాడ- ఆది శ్రీనివాస్
మానకొండూరు- ఆరేపల్లి మోహన్
ఆందోల్- దామోదర రాజనర్సింహ
నర్సాపూర్- సునీతా లక్ష్మారెడ్డి
జహీరాబాద్- గీతారెడ్డి
సంగారెడ్డి- జయప్రకాశ్ రెడ్డి(జగ్గారెడ్డి)
గజ్వేల్- వంటేరు ప్రతాప్ రెడ్డి
కుత్బుల్లాపూర్- కూన శ్రీశైలం గౌడ్
మహేశ్వరం- పి. సబితా ఇంద్రారెడ్డి
చేవెళ్ల- కేఎస్ రత్నం
పరిగి- రామ్మోహన్ రెడ్డి
వికారాబాద్- గడ్డం ప్రసాద్ కుమార్
తాండూరు- పైలట్ రోహిత్ రెడ్డి
ముషీరాబాద్- ఎం. అనిల్ కుమార్ యాదవ్
నాంపల్లి- ఫిరోజ్ ఖాన్
గోషామహాల్- ముకేశ్ గౌడ్
చార్మినార్- మహ్మద్ గౌస్
చాంద్రాయణగుట్ట- ఇసా బినోబాయిద్ మిస్రీ
సికింద్రాబాబ్ కంటోన్మెంట్- సర్వే సత్యనారాయణ
కొడంగల్ – రేవంత్ రెడ్డి
జడ్చర్ల- మల్లు రవి
వనపర్తి- జి. చిన్నారెడ్డి
గద్వాల- డీ.కే అరుణ
అలంపూర్- సంపత్ కుమార్
నాగర్ కర్నూలు- నాగం జనార్ధన్ రెడ్డి
అచ్చంపేట్- సీ.హెచ్ వంశీకృష్ణ
కల్వకుర్తి- వంశీ చంద్‌రెడ్డి
నాగార్జున సాగర్- జానారెడ్డి
హుజుర్ నగర్- ఉత్తమ్ కుమార్ రెడ్డి
కోదాడ- పద్మావతి రెడ్డి
సూర్యాపేట్- ఆర్. దామోదర్ రెడ్డి
నల్గొండ- కోమటిరెడ్డి వెంకట్ ‌రెడ్డి
మునుగోడు- కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి
భువనగిరి- కుంభం అనిల్ కుమార్ రెడ్డి
నకిరేకల్- చిరుముర్తి లింగయ్య
ఆలేరు- భిక్షమయ్య గౌడ్
స్టేషన్ ఘన్‌పూర్- సింగపూర్ ఇందిర
పాలకుర్తి- జంగా రాఘవరెడ్డి
డోర్నకల్- జాటోత్ రామచంద్రు నాయక్
మహబూబాబాద్- పోరిక బలరాం నాయక్
నర్సంపేట్- దొంతి మాధవ్ రెడ్డి
పరకాల- కొండా సురేఖ
ములుగు- డి. అనసూయ అలియాస్ సీతక్క
పినపాక- రేగ కాంతారావు
మధిర- మల్లు భట్టి విక్రమార్క
కొత్తగూడెం – వనమా వెంకటేశ్వరరావు
భద్రాచలం- పోడెం వీరయ్య

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here