బీజేపీలో చేరిన ఈటల రాజేందర్ ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేయనుండడంతో టీఆర్ఎస్ అధిష్టానం అందుకు అనుగుణంగా ప్రణాళికలను మార్చుకుంటుంది. మరోవైపు ఈటల ప్రత్యర్ది కాంగ్రెస్ నేత కౌశిక్ రెడ్డి ఈటల బీజేపీలో చేరిక పై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
మరో వైపు గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్దిగా పోటీ చేసి ఓడిపోయిన కౌశిక్ రెడ్డి టికెట్టు ఇస్తే గెలిచి వస్తాను,పనితీరును చూసి వచ్చే సాధారణ ఎన్నికల నాటికిఏ నిర్ణయం తీసుకున్నా, శిరసావహిస్తాను అని చెబుతున్నారు.