Home News Stories

కాంగ్రెస్ కి దిగ్విజయ్ ప్లస్సా…మైనస్సా…?

దిగ్విజయ్ సింగ్ సీనియర్ కాంగ్రెస్ నేత,పది సంవత్సరాలు మధ్యప్రదేశ్ సీఎంగా ఏక చత్రాదిపత్యం. ఒకప్పుడు రాహుల్ కోటరీలో కీ రోల్ అలాంటి దిగ్గిరాజా ఇప్పుడు పార్టీలో ఏదో ఒక రచ్చకు కారణం అవుతున్నాడు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే దిగ్విజయ్ ముందు వెనక చూసుకోకుండా చేసే కామెంట్లతో కాంగ్రెస్ ఎప్పుడు ఎదో ఒక షాక్ ఇస్తూనే ఉన్నాడు. తాజాగా బీఎస్పీ అధినేత్రి మయావతితో వైరానికి ఈ సారే కారణం అవ్వడంతో అసలు దిగ్గిరాజా హస్తం పార్టీకి మేలు చేస్తున్నాడా పార్టీ పుట్టి ముంచుతున్నాడా అన్న టాక్ పార్టీలో వినిపిస్తుంది….

గతంలో దిగ్విజయ్ వ్యాఖ్యలు,చేతల మూలంగా తెలంగాణలో హస్తం పార్టీ భారీ ముల్యమే చెల్లించుకుంది. తెలంగాణ ఇచ్చాక గులాబీ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేస్తా అన్నారు టీఆర్ఎస్ అధినేత. కాని కేసీఆర్ ని సరిగ్గా హ్యాండిల్ చేయని దిగ్గిరాజా పుణ్యాన ఆ తర్వాత కాంగ్రెస్ భారీ ముల్యమే చెల్లించుకుంది. అంతేనా సోషల్ మీడియా అంటే అమితంగా ఇష్టపడే దిగ్విజయ్ తన ట్వీట్లతో అప్పుడప్పడూ అభాసుపాలవుతుంటారు. బీజేపీని ఇరుకున పెట్టే విషయమైతే చాలు… చాలు.. అది నిజమో, అబద్ధమో తెలుసుకోకుండా సోషల్‌ మీడియాలో షేర్‌ చేసేస్తుంటారు.

వచ్చే ఎన్నికల్లో మోడీని గద్దె దింపడమే లక్ష్యంగా అన్ని పార్టీలను కలుపుకువెళ్తున్న కాంగ్రెస్ కి మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌,చత్తీస్ గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో తన కామెంట్లతో షాకిచ్చారు. సొంత పార్టీకి దిగ్విజయ్ షాక్ ఏంటి అనుకుంటున్నారా అదే ట్విస్ట్ మరీ… చచ్చి చెడి అన్ని పార్టీలను కలుపుకు వెళ్తున్న హస్తం పార్టీ బీఎస్పీ అధినేత్రి మయావతి తో కూడా స్నేహం నడుపుతుంది. సడెన్ గా ఈయన బీఎస్పీ అధినేత్రి మాయావతి పై విరుచుకుపడ్దారు.

మధ్యప్రదేశ్,రాజస్థాన్,చత్తీస్ ఘడ్ లో కాంగ్రెస్ తో పొత్తు కుదరక తాను అనుకున్న స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించింది మయావతి. దీంతో సీబీఐ దాడులకు దడిసి మాయావతి ప్లేటు ఫిరాయించారని దిగ్గీ ట్విట్టర్ లో ట్విట్టడంతో ఆమెకు చిర్రెత్తుకొచ్చింది. దిగ్విజయ్‌ సింగ్‌ బీజేపీ ఏజెంట్‌ అంటూ ఆమె తీవ్ర స్థాయిలో ఫైరయ్యారు. మూడు రాష్ట్రాల్లో తమ గెలుపునకు కీలకంగా భావించిన బీఎస్పీ యూటర్న్‌ తీసుకోవడానికి కారణం దిగ్విజయ్‌ సింగే అని తెలిసినా ఆయనపై కాంగ్రెస్‌ ఎలాంటి క్రమశిక్షణ చర్యలు తీసుకోకపోవడం చర్చనీయాంశంగా మారింది.

ప్రతి విషయంలో కాంగ్రెస్ కి కుంపటిలా మారిన దిగ్విజయ్ పై చర్యలుండవా అంటే కారణం ఒకటే.. దిగ్గీ రాజాకు ఇప్పటికీ ఓబీసీల్లో పలుకుబడి ఉంది. ఎంతో కొంత బలం, బలగం ఉన్న నాయకుడు. తాను స్వయంగా ఎవరినీ గెలిపించలేకపోయినా, ఎవర్నైనా ఓడించడంలో మాత్రం దిట్ట. . దాంతో ఆయనను వదిలించుకోవడం ఇష్టం లేక- ఆయనకు కోఆర్టినేషన్‌ బాధ్యతల పేరిట నామ్‌కే వాస్తేగా ఓ చిన్న బిస్కెట్‌ పడేసి- పక్కన పెట్టారు. ఇక పర్సనల్ లైఫ్ లో లేటు వయసులో ఘాటు ప్రేమతోను వివాదస్పదమయ్యారు..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here