Home News

ఏపీలో మరో భారీ పథకానికి శ్రీకారం

దేశ చరిత్రలో మరో భారీ పథకానికి శ్రీకారం చుట్టింది ఏపీ సర్కార్. క్యాంప్‌ ఆఫీసు నుంచి వర్చువల్‌ విధానంలో రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్‌ జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణ పనులను సీఎం వైఎస్‌ జగన్‌ ప్రారంభించారు. 175 నియోజకవర్గాల్లో ఇళ్ల నిర్మాణాల్లో మొదటిదశ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. 16లక్షలకుపైగా ఇళ్లు కట్టే ఈ కార్యక్రమంలో జూన్‌ 2022 కల్లా పూర్తిచేసేలా కార్యక్రమ రూపకల్పన చేశారు. ఒకేసారి 30.76 లక్షల మంది ఆడపడుచుల పేరుతో రెండు విడతల్లో వీరందరికీ పక్కా ఇళ్లు నిర్మించేందుకు పూనుకుంది.

జూన్‌ 10 వరకు కోవిడ్‌నిబంధనలు పాటిస్తూ వారి చేతుల మీదుగా పునాదులు వేసే కార్యక్రమం చేపట్టనున్నట్లు సీఎం జగన్ తెలిపారు. రెండుదశల్లో రూ. 50,944 కోట్లు ఖర్చుతో రాష్ట్ర వ్యాప్తంగా ఇళ్లులేని నిరుపేదలకు ఇళ్లు నిర్మిస్తున్నట్లు సీఎం జగన్ తెలిపారు. రెండోదశ ఇళ్ల నిర్మాణం జూన్‌ 2022లో మొదలుపెట్టి 12.7 లక్షల కోట్లు ఖర్చు చేయనున్నట్లు తెలిపారు. 2020–21కు సంబంధించి రాష్ట్రాలవారీగా ర్యాంకులు విడుదల చేసిన నీతి ఆయోగ్‌ పలు అంశాల్లో మంచి పనితీరు కనపరిచినందుకు ఏపీకి ర్యాంకులు ప్రకటించింది. నీతి ఆయోగ్ తాజా ర్యాకింగ్స్ లో టాప్ ఐదు రాష్ట్రాల్లో ఏపీకి చోటు దక్కింది. 2020-21 సంవత్సరానికి ఎస్డీజీ ఇండియా ఇండెక్స్ లో 72 స్కోర్ తో మూడో స్థానంలో ఏపీ ఉంది. గతేడాదితో పోలిస్తే 5 పాయింట్లు అధికంగా సాధించింధి ఆంధ్రప్రదేశ్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here