Home News

చరిత్ర సృష్టించిన విజయన్‌..కేరళలో నాలుగు దశబ్దాల రికార్డు బద్దలు

కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ చరిత్ర సృష్టించారు. వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చి…రికార్డులకెక్కారు. ప్రకృతి వైపరీత్యాలు, వరదలు వచ్చినా…ధీటుగా ఎదుర్కొన్నారు. ప్రజల అభిమానాన్ని చురగొని…రెండోసారి ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబోతున్నారు.

పినరయి విజయన్‌ కేరళ రాజకీయాల్లో మేరునగధీరుడు. సీపీఎం పార్టీని వరుసగా రెండోసారి అధికారంలోకి తెచ్చిన ప్రజానాయకుడు. అసాధ్యం కానీ విజయాలను సుసాధ్యం చేసిన దళపతి. 40 ఏళ్లకు పైగా ఉన్న రికార్డును కమ్యూనిస్టు యోధుడు విజయన్‌…బద్దలు కొట్టారు. తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకొని…మరోసారి ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోనున్నారు. ధర్మదాం నుంచి పోటీ చేసిన పినరయి విజయన్‌ ప్రత్యర్థిపై 36వేల 905 ఓట్ల తేడాతో గెలుపొందారు.

కేరళలో రెండోసారి ఎల్డీఎఫ్‌ అధికారంలోకి వచ్చింది. గత ఎన్నికల్లో 91 సీట్లు గెలుపొంది ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది అధికార పక్షం. గతం కంటే ఎక్కువ సీట్లలో గెలుపొంది…తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకుంది. విజయన్‌ హయాంలోనే…కేరళలో భారీ వరదలు వచ్చాయ్. వేల కుటుంబాలు ఆశ్రయం కోల్పోయారు. మొక్కవోని ధైర్యంతో….ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొన్నారు. సీఎం కార్యాలయం నుంచి ఎప్పటికపుడు పర్యవేక్షించారు. వరదలతో ఆశ్రయం కోల్పోయిన వారికి స్వచ్ఛంద సంస్థలతో కలిసి ఇళ్లు కట్టించారు. కరోనా సమయంలో ప్రజల ఇళ్లకే నిత్యావసరాలను సరఫరా చేశారు. కరోనా సమయంలో ఏ సీఎం పని చేయని విధంగా పని చేశారు. రాష్ట్రంలో కోవిడ్‌ కేసులు పెరగకుండా…అడ్డుకట్ట వేసి ప్రజాభిమానం చురగొన్నారు.

ఎన్నికల ప్రచారంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్‌ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు విరామం లేకుండా ప్రచారం చేశారు. మోడీ, అమిత్‌ షా, నడ్డా…అందరూ ఒకే డైలాగ్‌ పేల్చారు. కాంగ్రెస్‌ హయాంలో సోలార్‌ స్కామ్‌, సీపీఎం పాలనలో గోల్డ్‌ స్కామ్‌ అంటూ ఊదరగొట్టారు. ఆధారాలు లేకపోయినా…గోల్డ్‌ స్కామ్‌తో ముఖ్యమంత్రి విజయన్‌కు సంబంధం ఉందంటూ ఆరోపణలు చేశారు. అక్కడితో ఆగని కమలం నేతలు…సచివాలయం నుంచే గోల్డ్‌ స్మగ్లింగ్‌ జరిగిందంటూ విమర్శించారు. సీబీఐ, ఈడీ కేసులతో బెదరగొట్టారు. ప్రజాభిమానంతోనే బీజేపీ నేతలకు బుద్ది చెప్పారు కమ్యూనిస్టు యోధుడు విజయన్‌.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here