Home News

కేసీఆర్ గాంధీ ఆస్పత్రి పర్యటన అందుకేనా ?

కేసీఆర్ సీఎం పదవి చేపట్టాక తెలంగాణ రాష్ట్రంలో తోలిసారి గాంధీ ఆస్పత్రికి వెళ్తున్నారు. కేసీఆర్ తోలిసారి సీఎం అయ్యాకా గాంధీ ఆస్పత్రిని అత్యధునిక మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిగా తీర్చిదిద్దుతా అని చెప్పినప్పటికి అవి నోటి మాటలకే పరిమితమయ్యాయి. ఇప్ప‌టి వ‌ర‌కు ఒక్క‌సారి కూడా గాంధీకి వెళ్ల‌ని కేసీఆర్‌..గత సంవత్సర కాలం నుంచి క‌రోనా సంక్షోభంలో కూడా అక్క‌డ జ‌రుగుతున్న ట్రీట్‌మెంట్‌ను ప‌రిశీలించ‌లేదు. గత ఆరోగ్యశాఖా మంత్రి ఈట‌ల రాజేంద‌ర్‌ మాత్ర‌మే రోజు వారి రివ్యూలు చేసి గాంధీ ఆస్పత్రిని పరిశీలించే వారు.

కేసీఆర్ ఈటలను మంత్రివర్గం నుంచి తొలగించిన తర్వాత ఆరోగ్యశాఖని తన పరిధిలో ఉంచుకున్నారు. పైగా సర్కార్ దవాఖానాల్లో వైద్యం పై ప్రతిపక్షాలు తీవ్ర విమర్షలు చేస్తున్నాయి. బెడ్ల కొరత,మందుల కొరత ఇలా అనేక సమస్యలతో కరోనా రోగుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. దీంతో ఈ విమర్షలకు చెక్ పెట్టేందుకే కేసీఆర్ కోవిడ్ సెంటర్ల పర్యటన మొదలుపెట్టారన్న చర్చ నడుస్తుంది. ముందుగా గాంధీ ఆస్పత్రిని పరిశీలించనున్న సీఎం అక్కడ పరిస్థితిని సమీక్షించి అక్కడ నుంచి గచ్చిబౌలిలోని టిమ్స్ ఆస్పత్రికి వెళ్తారు. ఇప్పుడు ఆరోగ్య‌శాఖ తన చేతిలో ఉండటం ప్రజలకు ఏవో మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామన్న వరాలు ఈ పర్యటనలో ఉండే అవకాశం ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here