Home News

హరీశ్ కి టీఆర్ఎస్ లో మళ్లీ ఊహించని ప్రాధాన్యం దక్కుతుందా

టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి కేసీఆర్ వెన్నంటే ఉన్న హరీశ్ రావు కు గులాబీ పార్టీ పై మంచి పట్టుంది. పార్టీకి ఎలాంటి సమస్య తలెత్తినా ఎలాంటి విపత్కర స్థితిలో అయినా గట్టెక్కించే సమర్ధత ఉంది. అందుకే ఆయన్ని పార్టీలో ట్రబుల్ షూటర్ గా పిలుస్తారు. పార్టీలో ప్రభుత్వంలో కీలకంగా పని చేసే హరీశ్ రావుకి టీఆర్ఎస్ రెండో సారి అధికారంలోకి వచ్చాక ప్రాధాన్యత క్రమంగా తగ్గుతూ వచ్చింది. దీంతో ఆయన తన పరిధిమేర పనిచేస్తూ సైలెంటయ్యారు. అయితే ఇప్పుడు టీఆర్ఎస్ ఏర్పడుతున్న పరిణామాలతో పార్టిలో ఒక్కసారిగా హరీశ్ రావుకి ప్రాధాన్యత పెరిగిందా అన్న చర్చ మొదలైంది.

టీఆర్‌ఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చాక పవర్ సెంటర్ మొత్తం కేసీఆర్-కేటీఆర్ చుట్టూనే కేంద్రికృతమైంది. ఇక మిగిలిన నేతలు,మంత్రులు అంతా నామమాత్రంగా మారారు. గత ప్రభుత్వంలో స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకున్న హరీశ్ సైతం కేవలం తన మంత్రిత్వశాఖ మరియు జిల్లాకే పరిమితమయ్యారు. టీఆర్‌ఎస్ లో సీనియర్ నేతగా ఉన్న ఈటల బర్తరఫ్ ఇటివల జరుగుతున్న పరిణామాలతో మళ్లీ కేసీఆర్ హరీశ్ కి కీలక భాద్యతలు అప్పగించనున్నట్లు తెలుస్తుంది.

ఈటల ఈ మధ్య కాలంలో మాట్లాడుతూ హరీశ్ రావు ఎన్నో అవ‌మానాలు జ‌రిగాయని, ఆయ‌న‌కు విలువ లేద‌ని చెప్పుకొచ్చారు. ఇది కాస్త టీఆర్ఎస్ లో అంతర్గత కల్లోలానికి దారితీసేలా లోలోపల చర్చ జరిగింది. కేసీఆర్ మంత్రులకు ఇచ్చే విలువ పై అతర నిర్ణయాల పై ఈటల రోజుకో బాంబు పేలుస్తుండటంతో మళ్ళీ హరీశ్ కి ప్రాధాన్యత పెంచుతున్నారు కేసీఆర్. ఈ మధ్య కాలంలో కేసీఆర్ నిర్వహించిన అన్ని సమీక్షల్లో,పర్యటనల్లో హరీశ్ రావు కీలకంగా వ్యవహరిస్తున్నారు. క్రమంగా కేటీఆర్ సైలెంట్ అయి హరీశ్ ని లైమ్ లైట్ లో ఉంచుతున్నారు. ఒక‌వేళ హుజూరాబాద్‌లో ఉప ఎన్నిక వ‌స్తే హ‌రీశ్‌రావుకు బాధ్య‌త‌లు అప్ప‌గించాల‌ని చూస్తున్న‌ట్టు తెలుస్తుంది.


మొత్తానికి టీఆర్ఎస్ లో పరిణామాలు మళ్లీ హరీశ్ ని యాక్టివ్ చేశాయన్న చర్చ పార్టీ శ్రేణుల్లో అంతర్గతంగా నడుస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here