Home News

మంత్రి ఈటల రాజేందర్ పై భూ కబ్జా ఆరోపణలు..సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం

టీఆర్‌ఎస్‌లో ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ భూ కబ్జా ఆరోపణల దుమారం రేగుతుంది. మంత్రి ఈటల భూకబ్జాలకు పాల్పడినట్లు​ సంచలన ఆరోపణలు వెలుగు చూశాయి. సుమారు 100 ఎకరాల భూమిని ఈటల జమునా హ్యచరీస్‌ కోసం కబ్జా చేశారని కొన్ని మీడియా చానళ్లలో ప్రసారమైంది. ఇటీవల ఈటల చేసిన వ్యాఖ్యలపై టీఆర్‌ఎస్‌లో కలకలం రేగుతోంది. కిరాయిదారులం కాదు.. పార్టీకి ఓనర్లమంటూ ఇటీవల ఈటల రాజేందర్‌ వ్యాఖ్యానించి టీఆర్‌ఎస్‌లో ప్రకంపనలు సృష్టించారు. కేబినెట్ లో మంత్రి పై ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ దీని పై స్పందించారు.

ఈటల భూకబ్జా ఆరోపణలపై విచారణకు ఆదేశించారు సీఎం కేసీఆర్. దర్యాప్తు జరిపి నివేదిక ఇవ్వాలని సీఎస్‌ను ఆదేశించారు. కలెక్టర్‌ ద్వారా సమగ్ర రిపోర్ట్‌ తెప్పించి ఇవ్వాలన్న సీఎం కేసీఆర్‌.. నిజనిజాలను నిగ్గు తేల్చాలని డీజీ పూర్ణచంద్రరావుకు ఆదేశాలు ఇచ్చారు. గత కొంత కాలం మంత్రి ఈటలకు ప్రభుత్వ పెద్దలకు కోల్డ్ వార్ నడుస్తుంది. కొంతకాలంగా పార్టీ నిర్వహించే కీలక కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఇటీవల కాలంలో సీఎం కేఆర్ నిర్వహించే మంత్రివర్గ సమావేశానికి కూడా ఈటలకు ఆహ్వానం లేకుండాపోయింది. తనకు మంత్రి పదవి ఎవరో వేసిన భిక్ష కాదని.. కులం పేరుతో కొట్లాడితే మంత్రి పదవి రాలేదంటూ ఇటివల ఈటెల కామెంట్స్‌ చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here