Home News

వేములవాడ పై ఫోకస్ పెట్టిన టీఆర్‌ఎస్‌..ముఖ్యనేత బరిలో దిగే చాన్స్..!

వేములవాడ అసెంబ్లీ నియోజకవర్గం పై టీఆర్ఎస్ మరింత దృష్టి పెట్టింది. 2009 నుంచి వరుస విజయాలు సాధిస్తున్న టీఆర్ఎస్ ఈసారి ఎన్నికల పై స్పెషల్ ఫోకస్ పెట్టింది. దేశంలో కరోనా ప్రభావం మొదలుకావడానికి ముందే జర్మనీ వెళ్లిన ఎమ్మెల్యే రమేష్‌ ఇంకా తిరిగి రాలేదు. కొంతకాలంగా ఎమ్మెల్యే అక్కడే ఉంటున్నారు. ఈ వివాదంపై కోర్టులో విచారణ కూడా జరుగుతోంది. పౌరసత్వం పై కోర్టు నిర్ణయం దృష్యా ఉపఎన్నిక వస్తుందాన్న చర్చ సైతం నడిచింది. అయితే ఎమ్మెల్యే అందుబాటులో లేకపోతే తప్పుడు సంకేతాలు వెళ్తాయని భావిస్తున్న కేసీఆర్ నియోజకవర్గం పై కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.

ఎమ్మెల్యే రమేశ్ ఫోన్ ద్వారా నియోజకవర్గ ప్రజలతో టచ్‌లో ఉండేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఇటీవల వేములవాడలో ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ ఏర్పాటుపై స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల బృందం మంత్రి కేటిఆర్‌ను కలిసి వినతిపత్రం ఇచ్చింది. ఆ సమయంలో ఎమ్మెల్యే రమేష్‌.. మంత్రితో ఫోన్లో మాట్లాడారట. స్పెషల్‌ ఫుడ్‌ ప్రోసెసింగ్‌ జోన్‌ ఏర్పాటు కోసం విజ్ఞప్తి చేశారట. అయితే తాజా రాజకీయ పరిస్థితుల్లో వేములవాడ నుంచి మరోసారి చెన్నమనేని కి చాన్స్ లేనట్లే అని తెలుస్తుంది. ఎక్కువ కాలం ఎమ్మెల్యే నియెజకవర్గంలో అందుబాటులో లేకపోతే రాజకీయంగా తప్పుడు సంకేతాలు వెళ్తాయన్న చర్చ జరుగుతోంది.

పౌరసత్వం వివాదం కొలిక్కి రాకపోవడంతో వేములవాడలో కొత్తవారికి ఛాన్స్‌ ఇచ్చే అంశాన్ని టీఆర్‌ఎస్‌ పరిశీలిస్తున్నట్టు చెబుతున్నారు. రమేష్ అందుబాటులో లేని అంశాన్ని విపక్షాలు ఇప్పటికే రాజకీయంగా వాడుకుంటున్నాయి. నియెజకవర్గంలోని సామాజిక, రాజకీయ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని కేసీఆర్ సన్నిహితుడు టీఆర్ఎస్ కీలకనేత మాజీ ఎంపీ వినోద్ కుమార్‌ను బరిలో దించుతారని కొందరు భావిస్తున్నారు. పౌరసత్వ వివాదంతో వేములవాడలో రాజకీయలు, సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి.

బీజేపీ కూడా వేములవాడ పై స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఆ పార్టీనుంచి ఆదిశ్రీనివాస్ ఇప్పటికే జనంలోకి వెళ్తుండగా మాజీ జెడ్పీ చైర్మన్ తుల ఉమ పార్టీలోకి రావడం అదనపు బలంగా చెప్పోచ్చు. తుల ఉమ 2018 ఎన్నికల్లో టీఆర్ఎస్ టిక్కెట్ కోసం గట్టిగా ప్రయత్నించారు. కేసీఆర్ కాస్త దూరం పెట్టడంతో ఈటలతో కలిసి కమలం కండువా కప్పుకున్నారు తుల ఉమ. రానున్న రోజుల్లో లోకల్‌ పాలిటిక్స్‌ ఎలాంటి మలుపు తిరుగుతాయో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here