Home News

సీఎం కేసీఆర్ ఇమేజ్ పెంచుకునే పనిలో పడ్దారా..వరుస పర్యటనలు దేనికి సంకేతం

సీఎం కేసీఆర్ తొలి సారి తెలంగాణ ముఖ్యమమ్తి బాధ్యతలు చేపట్టాక జనంలోనే ఎక్కువ ఉండటానికి మొగ్గు చూపారు. ఏదో ఒక జిల్లాలో పర్యటిస్తూ ప్రజల జీవనస్థితి గతుల పై స్పందించి చర్యలు తీసుకునే వారు. తెలంగాణ ఉద్య‌మంలో ఉన్న‌ప్పుడు సైతం జనంలోనే ఉన్న కేసీఆర్ రెండోసారి అధికారం చేపట్టాక బ‌య‌ట క‌నిపించ‌డం దాదాపు మానేశారు. దీంతో ప్రతిపక్షాల విమర్షలు మరోపక్క సాధరణ జనంలోనూ కేసీఆర్ పట్ల కాస్త గౌరవం తగ్గింది.

రెండవసారి సీఎం అయ్యాక ఆయ‌న ఎంత‌సేపు ప్ర‌గ‌తిభ‌వ‌న్‌, ఫామ్‌హౌస్‌లోనే ఉండేవారు. అయినా ఇవేవీ ప‌ట్టించుకోకుండా త‌న ప‌ని తాను చేసుకుంటూ వెళ్లేవారు. ఎవ‌రు ఏమ‌న్నా ప‌ట్టించుకోకుండా ప్ర‌గ‌తి భ‌వ‌న్ నుంచే పాల‌న న‌డిపించేవారు. ఎలాంటి ప‌రామ‌ర్శ‌ల‌కు గానీ, ప‌రిశీల‌న‌ల‌కు గానీ వెళ్లేవారు కాదు. కానీ తెలంగాణలో వరుసగా జరుగుతున్న పరిణామాలు అధికారపార్టీకి డెంజర్ బెల్స్ మోగిస్తున్నాయి. సాధారణంగా పాలకుడిలో నిర్లిప్తత ఉంటే ఇక అధికారగణం సంగతి చెప్పనక్కర్లేదు. ఇవన్ని టీఆర్ఎస్ సర్కార్‌ ప్రతిష్టని మసకబారుస్తున్నాయి.

సంక్షేమ పథకాలు ఏ స్థాయిలో అమలు చేసినా సామాన్యుడికి పాలకుడు అందుబాటులో ఉన్నప్పుడే ఒక సంతృప్తి ఉంటుంది. ఇప్పుడు దాన్నించి కేసీఆర్ దూరమయ్యారు. ఇక సరైన ప్రతిపక్షం రాష్ట్రంలో లేకపోవడం అధికారపక్షానికి అనుకూలంగా మారింది. ఎంతటి అనుకూలతలున్నా ప్రజలు కాదు అనుకున్నప్పుడు పాతళంలో ఉన్న పార్టీని అయినా పైకి తీసుకోస్తారు. అంబారీ పై ఊరేగుతున్న పాతాళానికి తొక్కేస్తారు. ఇక ఈ నిజాన్ని గమనించారో ఏమో సీఎం కేసీఆర్ లోను కాస్త మార్పు కనిపిస్తుంది.

ఇక ఎప్పుడైతే ఈట‌ల‌ను బ‌ర్త‌ర‌ఫ్ చేశారో అప్ప‌టి నుంచి అది ప్రభుత్వ ప్రతిష్టకి కాస్త ఇబ్బందిగా మారింది. ఆయుష్మాన్ భార‌త్‌ను అమ‌లు చేయ‌డం, సీఎంగా తొలిసారి గాంధీకి వెళ్ల‌డం,ఈరోజు వరంగల్ ఎంజీఎం ఆస్పత్రి పర్యటన ఇలా క‌రోనాపై నిత్యం స‌మీక్ష‌లు నిర్వ‌హించ‌డం చూస్తుంటే.. మ‌ళ్లీ ప్ర‌జ‌ల్లో పడిపోయిన ఇమేజ్ తిరిగి పొందేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నట్లు ఉంది.ప్ర‌తిప‌క్షాల గ్రాఫ్ ను త‌గ్గించి, మ‌ల్లీ కేసీఆర్ గ్రాఫ్‌ను పెంచుకోవాల‌ని చూస్తున్నారు. మ‌రి ముందు ఇంకెన్నిచేస్తారో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here