Home News Updates

జేబీఎస్ టు ఎంజీబీఎస్ మెట్రో ప్రారంభించిన కేసీఆర్

జేబిఎస్ ఎంజీబీఎస్ మెట్రో కారిడార్ ప్రారంభమైంది. హైదరాబాద్ ప్రజలు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఈ రూట్ ని జెండా ఊపి సి ఎం కేసీఆర్ ప్రారంభించారు.

11 కిలోమీటర్ల పొడవుతో 9 స్టేషన్లు ఈ రూట్ లో అందుబాటులో ఉంటాయి. జూబిలీ బస్సు స్టేషన్, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, గాంధీ హాస్పిటల్, అర్టెసీ క్రాస్ రోడ్స్, సుల్తాన్ బజార్ తో పాటు రాష్ట్రంలోనే అతి పెద్ద బస్సు స్టేషన్ అయినా ఎంజీబీఎస్ వరకు ఈ మెట్రో వెళ్తుంది.

KCR Launches JBS MGBS Metro Service

ఇప్పటి వరకు నగరంలోని అన్ని మెట్రో స్టేషన్ల లో జేబీఎస్ స్టేషన్ చాలా ఎత్తైనది. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి తో పాటు కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.