Home Videos

తెలంగాణ లాక్ డౌన్ సడలింపులు..కొత్త లాక్ డౌన్ రూల్స్ పై కేసీఆర్ కీలక నిర్ణయం

తెలంగాణలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. కరోనా సెకండ్ వేవ్ ఉధృతి తగ్గడంతో పాజిటివ్ కేసుల సంఖ్య కూడా తగ్గింది. కరోనా కారణంగా గత 25 రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో లాక్ డౌన్ విధించారు. అయితే ఇప్పుడు ఈ లాక్ డౌన్ ఎత్తివేయాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తుంది. పాజిటివ్‌ కేసుల సంఖ్య తగ్గుతుండడంతో.. రాష్ట్రంలో పగటివేళల్లో లాక్‌డౌన్‌ను పూర్తిగా ఎత్తివేయాలని అనుకుంటుంది తెలంగాణ సర్కార్. కరోనా సెకండ్ వేవ్‌తో ప్రారంభంలో నెల రోజులపాటు రాత్రి కర్ఫ్యూ విధించిన ప్రభుత్వం.. ఆ తర్వాత మే 12 నుంచి 30 వరకు లాక్‌డౌన్‌ విధించింది.ఈ సమయంలో కేవలం ఉదయం 6 నుంచి 10 గంటల వరకు మాత్రమే సడలింపు ఇచ్చింది.మే 31 నుంచి సడలింపు సమయాన్ని మధ్యాహ్నం 2 వరకు పొడిగించింది.

గత నెలతో పోలిస్తే పాజిటివ్ కేసుల సంఖ్య రాష్ట్రంలో ఘననీయంగా తగ్గింది. ప్రస్తుతం పాజిటివ్‌ రేటు 2శాతమే ఉందని వైద్యాఅరోగ్యశాఖ అధికారులు తెలిపారు. వైద్య ఆరోగ్య శాఖ అందించే నివేదికల ఆధారంగానే ప్రభుత్వం నైట్‌ కర్ఫ్యూ, లాక్‌డౌన్‌పై నిర్ణయం తీసుకుంటున్నందున.. ఈ నెల 9 తర్వాత పగటివేళల్లో లాక్‌డౌన్‌ను పూర్తిగా ఎత్తివేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.రేపు జరిగే కేబినెట్ భేటీలో సీఎం కేసీఆర్ ఈ కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here