Home News

ఉపఎన్నిక పై కేసీఆర్ నజర్..ఈటలను ఢీకొట్టే అభ్యర్ది పై దృష్టి పెట్టిన ముఖ్యనేతలు

ఈటల రాజేందర్ రాజీనామాతో హుజూరాబాద్‌లో ఉపఎన్నిక అనివార్యమైంది. ఆ నియోజకవర్గంలో మళ్లీ గులాబీ జెండాను ఎగరేసేందుకు టీఆర్‌ఎస్‌ పావులు కదుపుతోంది. నియోజకవర్గంలో పరిస్థితిపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తోంది. పార్టీ శ్రేణులు ఈటల వెంట వెళ్లకుండా జాగ్రత్త పడుతోంది. హుజురాబాద్ లో మండలాల వారిగా ఇంఛార్జ్‌లను కూడా నియమించింది. ఈ వారమే నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించేందుకు నేతలు కసరత్తు మొదలుపెట్టేశారు. సాగర్‌ గెలుపుతో ఉత్సాహంగా ఉన్న కేసీఆర్ ఈటల పై స్పెషల్ ఫోకస్ పెట్టారు.

హుజురాబాద్‌లో టీఆర్ఎస్ తరఫున బరిలో దిగేది ఎవరనేది ఇప్పుడు హాట్‌ టాపిక్ మారింది. పలువురి పేర్లు తెరపైకి వచ్చినా… టీఆర్ఎస్ నేత బోయినిపల్లి వినోద్ కుమార్ , ఎంపీ కెప్టెన్ లక్ష్మీకాంత రావు భార్య పేర్లు రేసులో ముందున్నాయని సమాచారం. ఈటల సామాజికవర్గాన్ని పరిగణలోకి తీసుకుని బీసీ వర్గం నుంచి ఎవరినైనా బరిలోకి దింపే ఆలోచనలో కూడా టీఆర్‌ఎస్‌ ఉన్నట్టు తెలుస్తోంది. 2018లో ఈటలపై పోటీ చేసిన కాంగ్రెస్ నేత కౌశిక్‌రెడ్డి… ఒకవేళ టీఆర్ఎస్‌లోకి వస్తే ఆయన పేరును కూడా పరిశీలించే అవకాశం లేకపోలేదు.

టీఆర్ఎస్‌లో ఉన్న ఒకరిద్దరు బీసీ సామాజికవర్గ నేతలు కూడా తమ ప్రయత్నాలలో ఉన్నట్టు తెలుస్తోంది. బీసీ కమిషన్ మాజీ సభ్యుడు వకులాభరణం కృష్ణమోహన్ ఉపఎన్నికలో పోటీచేసేందుకు ప్రయత్నిస్తున్నారని సమచారం. ఏదేమైనా హుజురాబాద్ బైఎలక్షన్‌ను టీఆర్‌ఎస్‌ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. బలమైన అభ్యర్థిని బరిలోకి దింపేందుకు కసరత్తు ముమ్మరం చేసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here