Home News

బీసీ స్లోగన్ అందుకున్న కేసీఆర్..త్వరలో మరిన్ని చేరికలు

టీఆర్ఎస్ లో బీసీ సామాజిక వర్గ నేతలను చేర్చుకోవడంపై దృష్టిపెట్టారు సీఎం కేసీఆర్. తొలుత టీటీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణతో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సంప్రదింపులు ఆ తర్వాత బీసీ నేతల మరిన్ని చేరికలంటు గులాబీ పార్టీలో చర్చ మొదలైంది. ఈటల వదిలిన బీసీ బాణాన్ని తిప్పికొట్టేందుకు కేసీఆర్ గట్టి కసరత్తే చేస్తున్నారు. మారుతున్న రాజకీయ పరిణామాలతో చేరికల పై దృష్టిపెట్టింది టీఆర్ఎస్.

టిఆర్ఎస్ పార్టీకి ఈటలరాజేందర్ దూరం కావడంతో.. ఆ సామాజిక వర్గానికి చెందిన నేతల్ని చేర్చుకోవాలని భావిస్తోంది టిఆర్ఎస్‌. అందులో భాగంగానే టిటీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ తో సంప్రదింపులు మొదలుపెట్టారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. రమణతో పూర్తి స్థాయిలో చర్చలు జరగాల్సి ఉండగా కొద్ది రోజుల్లో ఆయన చేరికపై స్పష్ఠత వచ్చే అవకాశం ఉంది. ఈటల రాజేందర్ పార్టీ వీడడం వల్ల నష్టమేం లేదన్న భావనలో టిఆర్ఎస్ పార్టీ ఉంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో బీసీ సామాజిక వర్గాలకు చెందిన నేతలను పార్టీలోకి తీసుకోవడం ద్వారా సానుకూల సంకేతాలు పంపాలని అధికార పార్టీ ఆలోచనగా ఉన్నట్టు తెలుస్తోంది.

విపక్ష పార్టీలలో ఎంతో కొంత పట్టు ఉన్న బీసీ సామాజిక వర్గం నేతలతో సంప్రదింపులు జరుగుతోంది. ఇప్పటికే ఒకరిద్దరు బీసీ సామాజిక వర్గ నేతలతో చర్చలు జరిగాయన్న ప్రచారం జరుగుతోంది.మరి ఎల్ రమణతో ప్రారంభమైన టిఆర్ఎస్ ప్రయత్నాలు ఎటువంటి ఫలితాలనిస్తాయో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here