Home News

ఆ ఎంపీ స్పీడ్ కి జగన్ బ్రేకులు…!

పార్టీలో ఎవరికీ లభించని ప్రాధాన్యత దక్కింది… రాజధాని ప్రాంతంలో పోరాటాలు ఆయనకు పేరు తెచ్చాయి .. దాంతో పొలిటికల్‌ బ్యాక్‌గ్రౌండ్‌ ఏమీ లేకపోయినా అధినేత ఆశీస్సులతో ఏకంగా ఎంపీ టికెట్‌ దక్కించుకున్నారు… ఊహించని రీతిలో విజయం సాధించి లోక్‌సభలో అడుగుపెట్టారు.. అంతవరకు బానే ఉన్నా ఆ నేతకు సంతోషం ఎక్కువ రోజులు మిగలలేదంట … పట్టుమని 30 రోజులు తిరగకుండానే అధినేత ఆయన్ని పక్కన పెట్టేసారంట … ఆ అన్‌లక్కీ లీడర్‌ పై ఇప్పుడు వైసీపీలో హాట్ హాట్ గా చర్చ నడుస్తుంది…

గుంటూరు జిల్లా వైసీపీ నేతల మధ్య విభేదాల రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి.. … తాడికొండ వైసిపి ఎమ్మెల్యే శ్రీదేవి, బాపట్ల ఎంపీ నందిగం సురేష్ మధ్య మొదలైన రచ్చ సీఎం వైఎస్‌ జగన్ దృష్టికి వెళ్లింది .. దాంతో పార్టీ పెద్దలు రంగంలోకి దిగి రాజీ కురిర్చే ప్రయత్నం చేయడంతో వివాదం సద్దుమణిగినట్లే కనిపించింది … అయితే ఈ వ్యవహారం అంతటితో ముగిసినట్లు కనిపించడం లేదు ..

పార్టీ ఎంపీ, ఎమ్మెల్యేల మధ్య వివాదానికి సంబంధించి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పూర్తి వివరాలు తెప్పించుకున్నారంట .. ఈ ఎపిసోడ్‌లో పార్లమెంటు సభ్యుడు నందిగామ సురేష్ వ్యవహారతీరు సీఎంకు ఆగ్రహం తెప్పించినట్టు పార్టీ పెద్దలు చెబుతున్నారు … వాస్తవానికి నందిగం సురేష్‌ని ఎంపీ అభ్యర్థిగా జగన్ స్వయంగా ఎంపిక చేశారు … అలా అనూహ్యంగా తెరపైకి వచ్చిన నందిగం సురేష్‌కి పార్టీలో అధిక ప్రాధాన్యత లభించింది…

సార్వత్రిక ఎన్నికలకు ముందు వైఎస్ సమాధి వద్ద నందిగం సురేష్‌తోనే అభ్యర్ధుల జాబితాను విడుదల చేయించారు వైసీపీ అధినేత .. దీంతో అతి తక్కువ కాలంలోనే నందిగం సురేష్ కు పార్టీలో గుర్తింపు ప్రాధాన్యత లభించింది … ఆ తర్వాత జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బాపట్ల పార్లమెంటు స్థానానికి పార్టీ అభ్యర్ధిగా నందిగం సురేష్‌ను జగన్ ప్రకటించడం … పార్టీ అండదండలతో ఆయన విజయం సాధించడం చకచకా జరిగిపోయాయి.

ఇంతవరకు బాగానే ఉన్నా .. పార్టీ లో తనకు ఉన్న ప్రాధాన్యత , జగన్ వద్ద ఉన్న పలుకుబడి చూసుకుని నందిగం సురేష్ అవసరానికి మించిన దూకుడు ప్రదర్శించారన్న టాక్‌ ఉంది.. .. సొంత పార్టీ మహిళా శాసనసభ్యురాలు శ్రీదేవికి వ్యతిరేకంగా తన అనుచరులతో ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్న తాడికొండ నియోజకవర్గంలో హల్‌చల్‌ చేసేందుకు ప్రయత్నించారంటాయన.. వీటన్నిటికీ మించి కృష్ణా, గుంటూరు జిల్లాల్లో సురేష్ తన సామాజిక వర్గానికి సంబంధించిన కీలకంగా వ్యవహరించేందుకు స్థానిక వైసీపీ నేతలకు సమాచారం లేకుండా పర్యటించడం… ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకోవటం … ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలపై స్థానిక నేతల ఫోటోలు లేకపోవడం పార్టీలోని సీనియర్ నేతలు సైతం ఆశ్చర్యానికి గురి చేసింది ..

దీనికి సంబంధించి పార్టీ సీనియర్ నేత ఒకరు నందిగం సురేష్‌కు సమాచారం ఇచ్చి వివరణ అడిగేందుకు ప్రయత్నించారంట … అయితే పార్టీ అధినేత ప్రశ్నిస్తేనే సమాధానం ఇస్తానన్నట్లు సమాధానం చెప్పిన బాపట్ల ఎంపీ… తనను చిన్నచూపు చూడటంతో సదరు నేత మనస్థాపానికి గురయ్యారని పార్టీ నేతలు అంటున్నారు .. శాసనసభ్యురాలు శ్రీదేవి విషయంలో కూడా నందిగం సురేష్ వ్యవహారశైలిపై పార్టీ పెద్దలు ముందుగానే మందలించి సున్నితంగా నచ్చచెప్పేందుకు ప్రయత్నం చేశారట .. అయినా ఆయన వెన్కు తగ్గలేదంట..

చివరికి శాసనసభ్యురాలు శ్రీదేవి నేరుగా సీఎం జగన్ వద్దే పంచాయతీ పెట్టడం.. ఆయన ఎంక్వయిరీ చేయడంతో అసలు వ్యవహారం వెలుగు చూసింది .. దీంతో జగన్ నందిగం సురేష్‌ను పూర్తిగా పక్కన పెట్టారని పార్టీ లో గుసగుసలు వినిపిస్తున్నాయి .. అంతకుముందు జగన్ ఛాంబర్లోకి, పార్టీ సమావేశాల్లోకి, అంతర్గతంగా జరిగే కొన్ని మీటింగుల్లోకి సురేష్ నేరుగా వెళ్లేవారు.. అయితే ఇప్పుడు అంత సీన్‌ లేకుండా పోయిందంట..

సురేష్‌ వస్తే సిబ్బంది తలుపుల వద్ద ఆపి …మీకు ఆహ్వానం లేదు అని ముఖం మీద చెప్పేస్తున్నారట.. అంతేకాదు జగన్‌ను కలుసుకునేందుకు ఆయన చాంబర్ వద్దకు వెళ్తే.. కుదరదని వెనక్కి పంపించేస్తున్నారంట.. కనీసం కాన్వాయ్ వద్ద కలుద్దామని ప్రయత్నిస్తే .. జగన్ కనీసం కన్నెత్తి చూడను కూడా చూడటం లేదట.. ఈ పరిస్థితిపై సురేష్ పార్టీలోని ముఖ్య నేత వద్ద గోడు వెళ్లబోసుకున్నారంట .. దానికాయన జగన్ వంటి నాయకులు వద్ద అవకాశం ఒకసారే దక్కుతుందని … దాన్ని చెడగొట్టుకుంటే మరో ఛాన్స్ ఉండే అవకాశాలు లేవని స్పష్టం చేశారట… దాంతో సురేష్‌ అవాక్కై జగన్‌ను ఎలాగైనా కలిసి… తన వాదన వినిపించడానికి విశ్వ ప్రయత్నాలు చేసుకుంటున్నారు .. చూడాలి ఆ అవకాశం ఆయనకు ఎప్పటికి దక్కుతుంతో?.. అసలు దక్కుతుందో లేదో?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here