ఏపీ సీఎం జగన్ కి సొంత రాష్ట్రం కంటే పక్క రాష్ట్రం నుంచి ఇప్పుడు సమస్యలు ఎక్కువయ్యాయి. తమిళనాడు సీఎంగా స్టాలిన్ ప్రమాణస్వీకారం చేశాక స్టాలిన్ తీసుకున్న నిర్ణయాలు జగన్ ని ఇబ్బంది పెడుతున్నాయి. స్టాలిన్ ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన తర్వాత ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు, ఆయన అమలు పర్చే విధానాలు జగన్ పాలనను ప్రశ్నించే విధంగా ఉన్నాయి. అమ్మా క్యాంటిన్లు అలాగా నడపడం కరోనా నియంత్రణలో విపక్షాలను కలుపుకుని వెళ్లడం స్టాలిన్ ఇమేజ్ ని దక్షిణాదిన అమాంతం పెంచింది.

తమిళనాడు రాజకీయాలు ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు ఇబ్బందిగా మారనున్నాయి. ఇప్పటి వరకూ ఏపీలో అమలవుతున్న సంక్షేమ పథకాలను తమిళ నేతలు తమ రాష్ట్రంలో తీసుకు వచ్చారు. అయితే అంబులెన్స్ లు, వాలంటీర్ల వ్యవస్థ, ఇంటికే రేషన్ వంటి పథకాలు జగన్ ఇమేజ్ ను పెంచాయి. స్టాలిన్ వచ్చిన తర్వాత అమ్మ క్యాంటిన్లను కంటిన్యూ చేస్తామని చెప్పడం, జయలలిత ఫొటోలను ధ్వంసం చేసిన తమ పార్టీ వారిపై నే చర్యలు తీసుకోవడం ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్ గా మారింది. ఏపీలోని ప్రతిపక్ష టీడీపీకి స్టాలిన్ అస్త్రాలు సమకూర్చినట్లయింది.