Home News

సొంత మీడియా ప్రచారం వదిలి గ్రౌండ్ రియాల్టీ పై జగన్ దృష్టి పెడతారా

ఏపీలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. పాజీటివిటీ రేటు ఓ పక్క ఆందోళనకి గురి చేస్తుంది. అయితే అనుకూల మీడియాలో మాత్రం పరిస్థితి అంతా సానుకూలంగా ఉన్నట్లు చూపుతున్నా వాస్తవ పరిస్థితులు మాత్రం ఆందోళనకరంగానే ఉన్నాయి. మంత్రులు పూర్తిగా సైలెంట్ అయిపోయారు. కరొనా మొదటి వేవ్ సమయంలో చూపిన చొరవ ఇప్పుడు చాలామందిలో కనిపించడం లేదు. మరోపక్క క్షేత్రస్థాయి పరిస్థితులు సైతం అధికారులు జగన్ దృష్టికి తీసికురావడం లేదు దీంతో అసలుకే మోసం వచ్చేలా ఉంది.

జ‌గ‌న్ కానీ, ప్రభుత్వంలోని కీల‌క అధికారులు కానీ స్థానిక అధికారులు ఇచ్చే గణాంకాలనే న‌మ్ముతున్నారు. ఎవ‌రూ క్షేత్రస్థాయిలో నిజాలు చెప్పడం లేదు. ప్రభుత్వం సాధ్యమైనమైనంత రీతిలో ఏదో చేయాలని తపిస్తున్నా క్షేత్రస్థాయి పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. కరోనాని ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకురావడం,చనిపోయిన కుటుంబాలకు ఆర్ధికంగా సాయం అందిచడం బాగానే ఉన్నా ఆస్పత్రుల్లో సౌకర్యాలు,బెడ్లు దొరక్క సామాన్యులు పడే ఇబ్బందులు ఆందోళనకు గురి చేస్తున్నాయి.

ప్రభుత్వం భారీ ఎత్తున సౌక‌ర్యాలు క‌ల్పిస్తోంద‌ని అనుకూలమీడియా ప్రచారం చేస్తున్నా దీనికి భిన్నంగా ఓ వ‌ర్గం మీడియా ప్రచారం చేస్తోంది. ఫొటోలు, వీడియోలు.. ఆధారంగానే క్షేత్రస్థాయిలో ప‌రిస్థితి బాగోలేద‌ని.. ప్రభుత్వం చెబుతున్న సూచ‌ల‌ను, నిబంధ‌న‌ల‌ను ఏ ఆసుప‌త్రి, వైద్యులు కూడా పాటించ‌డం లేద‌ని గ‌గ్గోలు పెడుతున్నాయి. వాటిలో కూడా కొన్ని నిజాలున్నాయి. వాటిని సరిదిద్దుకోకుండా విపక్షాలను విమర్షించడం వల్ల క్షేత్రస్థాయిలో ప్రజ‌ల్లో ప్రభుత్వంపై న‌మ్మకం పోతుంది. కనుక ఇప్పుడున్న ప‌రిస్థితిలో క్షేత్రస్థాయిలో జరుగుతున్న వ్యవహారాల పై సీఎం జగన్ దృష్టి పెడితే ప్రజలకు మేలు చేసిన వాడవుతాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here