Home Entertainment Cinema

ఇండస్ట్రీకి మెగా మేనల్లుడు ఉప్పెనలా వస్తున్నాడుగా..

ఒక్క సినిమా కూడా విడుదల కాకముందే మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకునే పనిలో పడ్డాడు. ఈయన తొలి సినిమా ఉప్పెన ఇంకా షూటింగ్ జరుపుకుంటుంది. ఇప్పటికే 80 శాతం షూటింగ్ పూర్తైపోయింది. బుచ్చిబాబు ఈ సినిమాకు దర్శకుడు. సుకుమార్ రైటింగ్స్ తో కలిపి మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్ర షూటింగ్ వేగంగా జరుగుతోంది. ఇందులో విజయ్ సేతుపతి ప్రతినాయక పాత్రలో నటిస్తున్నాడు.

ఈ మధ్య విడుదలైన వైష్ణవ్ తేజ్ ఫస్ట్ లుక్ కు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇదిలా ఉంటే ఈ సినిమా విడుదల కాకుండానే ఇప్పుడు మరో సినిమాకు కూడా కమిట్ అయ్యాడు మెగా మేనల్లుడు. ఓ బేబీ సినిమాతో మంచి విజయం అందుకొని ఫామ్ లోకి వచ్చిన నందిని రెడ్డి.. వైష్ణవ్ తేజ్ కోసం ఒక కథ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. పూర్తిస్థాయి ప్రేమ కథగా తెరకెక్కబోయే ఈ సినిమాలో మెగా మేనల్లుడు హీరోగా నటించబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది.

ఇప్పటికే స్క్రిప్ట్ కూడా సిద్ధమైపోయింది. ఈ సినిమాను మహానటి నిర్మించిన ప్రియాంక దత్ ప్రొడ్యూస్ చేయబోతోంది. మిక్కీ జే మేయర్ సంగీతం అందించబోతున్నాడు. త్వరలోనే పూర్తి వివరాలు బయటకు రానున్నాయి. కచ్చితంగా ఈ సినిమాతో వైష్ణవ్ తేజ్ లవర్ బాయ్ ఇమేజ్ సంపాదించుకుంటాడని నందినిరెడ్డి వర్గాలు చెబుతున్నాయి.