Home Entertainment Cinema

అంతా చూస్తుండగానే అనసూయతో రొమాన్స్ చేసిన చిరంజీవి..

చిరంజీవి ఏంటి.. అనసూయతో రొమాన్స్ చేయడమేంటి.. ఏం మాట్లాడుతున్నారు అనుకుంటున్నారా. కానీ ఇదే నిజం. మెగాస్టార్ చిరంజీవి ఈ మధ్య ఏ వేడుకకు వచ్చిన కూడా అక్కడ హీరోయిన్లతో సరదాగా రొమాన్స్ చేస్తున్నాడు. తన మాటలతో అక్కడ ఉన్న వాళ్లందరినీ నవ్విస్తున్నాడు మెగాస్టార్. అంతెందుకు మొన్నటికి మొన్న సరిలేరు నీకెవ్వరు ప్రీ వేడుకలో ఒకప్పటి హీరోయిన్ విజయశాంతితో చిరంజీవి చేసిన రొమాన్స్ అంత ఈజీగా ఎవరూ మరిచిపోలేరు. చాలా సంవత్సరాల తర్వాత ఒకే స్టేజి మీద కలవడంతో విజయశాంతిని కౌగిలించుకొని పాత జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నాడు మెగాస్టార్. అంతకు ముందు రచ్చ ఆడియో ఫంక్షన్ లో తమన్నాతో తనకు నటించాలని ఉంది అంటూ చెప్పి ఆశ్చర్యపరిచాడు చిరు. గతేడాది సైరా సినిమాలో తమన్నాతో నటించాడు.

ఇక ఇప్పుడు కూడా ఓ పిట్ట కథ సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు వచ్చిన మెగాస్టార్ అక్కడే ఉన్న అనసూయతో మాటలు కలిపాడు. ఈ సినిమాలో బ్రహ్మాజీ తనయుడు సంజయ్ హీరోగా నటిస్తున్నాడు. మార్చ్ 6న విడుదల కానుంది ఓ పిట్ట కథ. చందు అనే కొత్త దర్శకుడు ఈ సినిమాను తెరకెక్కించాడు. స్వయంగా చిరంజీవి ఇంటికి వెళ్లి బ్రహ్మాజీ ఆహ్వానించడంతో ఆయన ఈ వేడుకకు వచ్చాడు. మధ్యలో ఇండస్ట్రీ గురించి సీరియస్ విషయాలు మాట్లాడుతూనే స్పీచ్ చివర్లో యాంకర్ అనసూయతో రొమాన్స్ చేశాడు మెగాస్టార్ చిరంజీవి. అక్కడే ఉన్న అనసూయను చూసి మీరు కూడా ఇక్కడికి గెస్ట్ గా వచ్చారా లేదంటే సినిమాలో నటించారా అని అడిగాడు. దానికి అతిథిగానే వచ్చానని అనసూయ చెప్పింది.

వెంటనే చిరంజీవి గుండె పట్టుకొని నొప్పిగా ఉంది అంటూ నవ్వేశాడు. మొన్నే డాక్టర్లకు చూపించుకొని అన్ని టెస్టులు చేయించుకున్నాను.. మీ గుండె బాగా గట్టిగా ఉంది అని చెప్పారు.. కానీ ఎందుకో తెలియదు ఇప్పుడు అనసూయను చూడగానే కాస్త నొప్పి వచ్చింది అంటూ చిరంజీవి చెప్పేసరికి అక్కడున్న వారు నవ్వేశారు. చిరు అలా అనగానే యాంకర్ అనసూయ కూడా సిగ్గు పడింది. మళ్ళీ వెంటనే ఇదంతా రామ్ చరణ్ కు చెప్పొద్దమ్మా అంటూ అనసూయకు తెలిపాడు. చిరు మొత్తానికి ముద్దుగుమ్మలతో అప్పుడప్పుడు మెగాస్టార్ ఇలా రొమాన్స్ చేస్తుంటే అభిమానులు కూడా చూసి సరదాగా నవ్వుకుంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here