గత రెండు రోజుల క్రితం యంగ్ టైగర్ ఎన్టీఆర్ కరోనా బారిన ప్రస్థుతం. ప్రస్తుతం ఆయన హోం ఐసోలేషన్ లో ఉండి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఎన్టీఆర్తో పాటు ఆయన కుటుంబ సభ్యులు కూడా హోంక్వారంటైల్లోకి వెళ్లారు. అయితే తన ఆరోగ్యం బాగానే ఉందని, వైద్యుల సలహా మేరకు చికిత్స తీసుకుంటున్నామని ఎన్టీఆర్ కరోనా సోకిన రోజు ట్వీట్ చేశారు. ఎన్టీఆర్ కి కరోనా పై అభిమానుల ఆందోళనలో ఉన్న నేపథ్యంలో ఎన్టీఆర్ హెల్త్ కండీషన్ పై ట్విట్టర్ వేదికగా అప్డేట్స్ ఇచ్చారు చిరంజీవి.
ఇంటి దగ్గర హోమ్ క్వారంటైన్లో ఉన్న తారక్ తో ఫోన్ లో మాట్లాడనన్న చిరంజీవీ ఎన్టీఆర్ ఆరోగ్యం బావుందని హెల్దీగానే ఉన్నారని అభిమానులకు తీపి కబురు చెప్పారు. కరోనా ప్రోటోకాల్ ప్రకారం అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారని వారి కుటుంబ సభ్యులు క్షేమంగా ఉన్నరని తెలిపారు. త్వరలో పూర్తిగా కోలుకుంటారని గాడ్ బ్లెస్ తారక్’ అని చిరంజీవి ట్వీట్ చేశాడు.