Home News Updates

చిరంజీవి ఇంటి వద్ద ఫ్యాన్స్.. మెగాస్టార్ కు సపోర్టుగా కామెంట్స్..

మెగాస్టార్ చిరంజీవి మరోసారి రాజకీయాల్లోకి లాగుతున్నారు. ఈయన పూర్తిగా కొన్ని రోజుల నుంచి సినిమాలతో బిజీ అయిపోయాడు. అసలు రాజకీయాల గురించి పట్టించుకోవడం లేదు. అయినా కూడా కొందరు కావాలనే చిరంజీవిని రాజకీయాల వైపు తీసుకొస్తున్నారు. ఆ మధ్య వైయస్ జగన్మోహన్ రెడ్డిని చిరంజీవి కలవడంతో మరోసారి ఈయన రాజకీయాల వైపు అడుగులు వేస్తున్నాడు అంటూ ప్రచారం జరిగింది. దానికి తోడు వైసీపీ ఎంపీ సీటు ఇస్తారని వార్తలు కూడా వచ్చాయి. ఇవన్నీ చిరంజీవి వర్గం అబద్ధమని కొట్టేసింది కూడా.

Chiranjeevi
Chiranjeevi

అమరావతి రైతుల గురించి చిరంజీవి ఏమీ మాట్లాడటం లేదు.. బాధ్యత లేకుండా ఉన్నారు అంటూ ఆయన ఇంటిముందు రైతులు ఆందోళన చేశారు. దాంతో ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్స్ రివర్స్ కౌంటర్ ఇస్తున్నారు. అసలు చట్టసభలలోకి వెళ్ళిన తర్వాత మొట్టమొదటి సారి రైతుల గురించి మాట్లాడింది చిరంజీవే అంటూ వాళ్ళు సమర్థిస్తున్నారు. అయినా కూడా ప్రస్తుతం చిరంజీవి ఎమ్మెల్యేగానూ ఎంపీగానే ఇతర అధికారంలో లేరు.. అలాంటప్పుడు చిరంజీవి ఇంటికి వచ్చి దీక్ష చేయడం వల్ల లాభమేంటి అంటూ వారు ప్రశ్నిస్తున్నారు. వెళ్లి చేసే దీక్షలేవో జేఏసీ నాయకులు.. కావాలంటే అధికారంలో ఉన్న వైసీపీ ఎమ్మెల్యేలు మంత్రులు ఇంటి వద్ద లేదా టిడిపి నాయకుల ఇళ్ల వద్ద ధర్నాలు చేయాలి అంటూ రైతులకు వాళ్ళు చెబుతున్నారు. ఇదంతా కేవలం పబ్లిసిటీ కోసం చేస్తున్న స్టంట్ అంటూ వాళ్ళు తీసి పారేస్తున్నారు.

కావాలని కొంతమంది చిరంజీవి ఇంటికి వచ్చి దీక్ష చేస్తే పబ్లిసిటీ వస్తుందని భావిస్తున్నారు. అందుకే రాజకీయాలకు దూరంగా ఉన్న మెగాస్టార్ చిరంజీవిని మరోసారి అటు వైపు లాగుతున్నారని.. దానివల్ల ఆయన పేరు పాడు చేయాలని కొందరు ప్రణాళిక ప్రకారమే ఇదంతా చేస్తున్నారు అంటూ అభిమానులు మండిపడుతున్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం కొరటాల శివ సినిమాతో బిజీగా ఉన్నాడు. మెగాస్టార్ చిరంజీవి ఇందులో మహేష్ బాబు కూడా నటిస్తున్నాడు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here