Home Entertainment Cinema

మహేష్ బాబు దర్శకుడిని లాగేసుకున్న మెగాస్టార్ చిరంజీవి..

రాజకీయాలు మానేసి సినిమాలు మొదలు పెట్టిన తర్వాత మెగాస్టార్ చిరంజీవిలో మునుపటి జోష్ మళ్లీ కనిపిస్తోంది. వరుస సినిమాలతో ఈయన దుమ్ము దులిపేస్తున్నాడు. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు చిరంజీవి. దీంతో పాటు మరో రెండు సినిమాలకు కూడా కమిట్ మెంట్ ఇచ్చాడు. ఒకవైపు కొరటాల శివ సినిమా షూటింగ్ జరుగుతుండగానే మరో వైపు మలయాళం బ్లాక్ బస్టర్ సినిమా లూసిఫర్ తెలుగు రీమేక్లో నటించడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు చిరంజీవి. దీని కోసం చాలా కాలం నుంచి సుకుమార్ ని అడుగుతున్నాడు. అయితే ఆయనకు రీమేక్ సినిమా చేయడం అస్సలు ఇష్టం లేదని తెలుస్తోంది. అయినా కూడా చిరంజీవి కోసం లూసిఫర్ తెలుగు రీమేక్ చేయడానికి సుకుమార్ సుముఖంగానే ఉన్నా చివరి నిమిషంలో ఏదో తేడా జరిగినట్లు ప్రచారం జరుగుతోంది.

Chiranjeevi
Chiranjeevi

అందుకే ఈ సినిమా నుంచి సుకుమార్ పూర్తిగా పక్కకు జరిగినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దాంతో లూసీఫర్ తెలుగు రీమేక్ తెరకెక్కించే బాధ్యత వంశీ పైడిపల్లి తీసుకుంటున్నాడని మెగా కాంపౌండ్ నుంచి వస్తున్న సమాచారం. ఈయనకు మెగా కుటుంబంతో మంచి అనుబంధమే ఉంది. ఇప్పటికే రామ్ చరణ్ హీరోగా ఎవడు సినిమా తెరకెక్కించాడు వంశీ. అప్పుడే ఈయన వర్కింగ్ స్టైల్ చూసి చిరంజీవి పడిపోయాడు. ఇక ఇప్పుడు మహేష్ బాబుతో వంశీ పైడిపల్లి కమిట్ అయిన సినిమా అనుకోకుండా ఆలస్యం అయ్యేలా కనిపిస్తోంది. దాంతో ఆ సినిమాను పక్కనపెట్టి చిరంజీవి సినిమా చేయాలని చూస్తున్నాడు వంశీ పైడిపల్లి.

కొరటాల శివ సినిమాతో పాటు లూసీఫర్ రీమేక్ కూడా ఒకేసారి పూర్తి చేయాలని చూస్తున్నాడు మెగాస్టార్. అన్నీ కుదిరితే 2020 లోనే లూసిఫర్ విడుదల చేసి.. వచ్చే ఏడాది వేసవిలో కొరటాల శివ సినిమాతో రావాలని చూస్తున్నాడు. చిరంజీవి ఒకవేళ ఇప్పటికిప్పుడు వంశీ పైడిపల్లిని లూసిఫర్ తెలుగు రీమేక్ కోసం దర్శకుడిగా తీసుకున్నా కూడా ఆయన కేవలం ఆరు నెలల్లోనే ఈ సినిమాను పూర్తి చేయాల్సి ఉంటుంది. డిసెంబర్లో ఈ సినిమా విడుదల చేస్తే బాగుంటుందని చిరంజీవి భావిస్తున్నాడు. మరి ఆయన ఆలోచనకు తగ్గట్లు వంశీ ఈ సినిమా అంత త్వరగా పూర్తి చేస్తాడా అనేది ఆసక్తికరంగా మారింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here