Home Entertainment Cinema

ఈ తరం హీరోలకు క్లాస్ తీసుకున్న చిరంజీవి..

చిరంజీవి ఎప్పుడు స్టేజ్ చెప్పినా కూడా చాలా కూల్ గా మాట్లాడుతుంటాడు. ఎలాంటి వివాదాల జోలికి వెళ్లడు. అక్కడికి తాను ఏ పని మీద వచ్చాడో అది పూర్తి చేసుకొని వెళ్లిపోతాడు. కానీ ఇప్పుడు మాత్రం ఆయన ఇండస్ట్రీలోని కొందరు హీరో హీరోయిన్లకు క్లాస్ తీసుకున్నాడు. ఇంకా చెప్పాలంటే చాలా సీరియస్ గా రియాక్ట్ అయ్యాడు. తాజాగా ఓ పిట్ట కథ సినిమా రిలీజ్ రిలీజ్ వేడుకకు వచ్చిన మెగాస్టార్ చిరంజీవి.. ఇండస్ట్రీ గురించి కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం ఉన్న ఇండస్ట్రీలో హీరో హీరోయిన్లకు సమయం విలువ తెలియడం లేదు అంటూ ఆయన క్లాస్ తీసుకున్నాడు. ముఖ్యంగా కార్వాన్ వాడుతున్న తీరుపై ఆయన మండిపడ్డాడు. లొకేషన్ కి వచ్చిన తర్వాత కార్వాన్ లోనే గంటలకొద్దీ ఉంటున్నారని.. అది మంచి పద్ధతి కాదు అంటూ చెప్పుకొచ్చాడు చిరంజీవి.

ఒకప్పుడు ఎలాంటి సౌకర్యాలు ఉండేవి కావని గుర్తు చేసుకున్నాడు. ఇప్పుడు కూడా తాను కేవలం మేకప్ కోసం.. బట్టలు మార్చుకోవడం కోసం.. టాయిలెట్ కోసం మాత్రమే కార్వాన్ వాడుతానని క్లారిటీ ఇచ్చాడు మెగాస్టార్. కానీ ఇప్పటి హీరో హీరోయిన్లు మాత్రం అందులోకి వెళ్లి గంటల తరబడి అక్కడే కూర్చుంటున్నారని.. వాళ్ళ కోసం ఒక అసిస్టెంట్ డైరెక్టర్ డోర్ దగ్గర నిలబడి లోపలికి పంపించడం బయటికి తీసుకురావడంతోనే వాడి జీవితం అయిపోతుంది అంటూ చిరంజీవి చెప్పాడు. ఇంకా వాడు డైరెక్షన్ ఎప్పుడు నేర్చుకుంటాడని ప్రశ్నిస్తున్నాడు. హీరో లొకేషన్ కి వచ్చిన తర్వాత ఖచ్చితంగా అక్కడే ఉండాలని.. అప్పుడే షూటింగ్ లో ఏం జరుగుతుంది అనే విషయం అతనికి క్లారిటీ వస్తుందని చెప్పాడు చిరంజీవి. ఒకప్పుడు తాము అలాగే చేసే వాళ్లమని.. ఇప్పటికీ తాను అదే చేస్తున్నాను అని చెప్పాడు ఈయన. ప్రస్తుతం తాను నటిస్తున్న కొరటాల శివ సినిమా షూటింగ్ రామోజీ ఫిలింసిటీలో జరుగుతుందని.. ఉదయం 7 గంటలకు మొదలవుతుంది అని చెప్పాడు మెగాస్టార్.

అంటే తాను నాలుగు గంటల 30 నిమిషాలకు నిద్ర లేచి.. స్నానం చేసి 6 గంటల వరకు లొకేషన్ కి వెళ్లి.. 6:30 వరకు మేకప్ వేసుకుని.. 7 గంటలకు షాట్ కోసం రెడీగా ఉంటాను అని చెప్పాడు అన్నయ్య. కానీ ఇప్పటి నటీనటులు మాత్రం చెప్పినట్టు సమయం కంటే రెండు మూడు గంటలు ఆలస్యంగా వస్తున్నట్లు తన దృష్టికి వచ్చిందని చెప్పాడు చిరంజీవి. ముఖ్యంగా మధ్యాహ్నం ఒక గంట బ్రేక్ ఇస్తే 3 గంటలు బ్రేక్ తీసుకుంటున్నారని.. అది మంచి పద్ధతి కాదని చెప్పాడు. ఒక సినిమాను 100 రోజుల లోపు తీస్తే నిర్మాతకు కూడా నష్టాలు ఉండవని చెబుతున్నాడు మెగాస్టార్. ఇండస్ట్రీలో ఎప్పుడు అర్ధాకలితో ఉండాలని.. కడుపునిండిన వ్యవహారం ఉంటే ఇక్కడ పనికిరాదని చెప్పాడు చిరు. అసలు ఇప్పుడు పరిస్థితులు చూస్తుంటే ఇండస్ట్రీ ఎందుకిలా మారిపోయింది అంటూ బాధ పడాల్సిన ఖర్మ పట్టింది అంటున్నాడు చిరంజీవి. ఇవన్నీ తాను నీతులు చెప్పడానికి కాదు.. సీనియర్ కాబట్టి చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి చెబుతున్నానని తెలిపాడు చిరంజీవి. కొన్నిసార్లు చెప్పేవారు లేక కూడా కొందరు దారి తప్పుతారని చెప్పాడు. ఇప్పటినుంచైనా ఖచ్చితంగా కొన్ని పద్ధతులు మార్చుకోవాల్సిన అవసరం ఉంది అంటున్నాడు మెగాస్టార్. మరి ఈయన చెప్పిన మాటలను హీరో హీరోయిన్లు ఎంతవరకు పట్టించుకుంటారో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here