Home Entertainment Cinema

దసరాకు చిరంజీవిని టార్గెట్ చేస్తున్న బాలకృష్ణ..

తెలుగు ఇండస్ట్రీలో చిరంజీవి, బాలయ్యకు ఉన్న ఇమేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇద్దరూ ఇద్దరే. మాస్ ఇమేజ్ లో తమకంటూ ఓ పేజీని లిఖించుకున్నారు ఈ ఇద్దరూ. ఇక ఈ ఇద్దరూ ఒకేసారి బాక్సాఫీస్ బరిలో దిగితే ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి.. ఇప్పుడు ఇదే జరగబోతుంది. ఆల్రెడీ మూడేళ్ల కింద సంక్రాంతికి చిరు, బాలయ్య సినిమాలు వచ్చాయి. ఇప్పుడు మరోసారి పండక్కే రాబోతున్నారు. అయితే ఈ సారి వాళ్లు వచ్చేది సంక్రాంతికి మాత్రం కాదు..

దసరా పండక్కి. 2020 దసరా చిరు, బాలయ్య టార్గెట్ చేస్తున్నారని ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం కొరటాల శివ సినిమాతో బిజీగా ఉన్నాడు మెగాస్టార్ చిరంజీవి. ఈయన నటిస్తున్న 152వ సినిమా ఇది. ఇప్పటికే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలైంది. సైరా తర్వాత కొన్ని రోజులు బ్రేక్ తీసుకుని ఈయన చేస్తున్న సినిమా ఇది. సందేశాత్మక విలువలున్న పక్కా కమర్షియల్ సినిమా ఇది. దాంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. 99 రోజుల్లోనే సినిమాను పూర్తి చేయాలని చూస్తున్నాడు దర్శకుడు కొరటాల శివ. ఆగస్ట్ 22న సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారు కానీ ఒకవేళ అనుకోకుండా డిలే అయితే మాత్రం దసరాకు సినిమాను విడుదల చేయాలని చూస్తున్నాడు ఈ దర్శకుడు.

మరోవైపు నందమూరి బాలకృష్ణ తన బోయపాటి సినిమాను దసరాకు విడుదల చేయాలని ఖాయం చేసుకున్నాడు. ఇప్పటికే ముహూర్తం కూడా పెట్టాడు బాలయ్య. అసలే బోయపాటితో సినిమా అంటే అంచనాలు మామూలుగా ఉండవు. ఇప్పుడు కూడా ఇదే చేయబోతున్నాడు ఈయన. మరోసారి బాలకృష్ణను పవర్ ఫుల్ రోల్ లో చూపించబోతున్నాడు. బోయపాటి శ్రీను తల్లి చనిపోవడంతో కొన్ని రోజులు షూటింగ్ ఆలస్యమైంది. అనుకున్న దానికంటే ఆలస్యంగా సినిమా మొదలు కానుంది. ఈ సినిమా కోసం బాలయ్య కొత్త లుక్ లోకి కూడా మారిపోయాడు. కచ్చితంగా ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ కొడతానని ధీమాగా చెబుతున్నాడు బోయపాటి శ్రీను.

వినయ విధేయ రామ సినిమాతో దారుణంగా పడిపోయింది ఈయన ఇమేజ్. దాంతో బాలయ్య సినిమానే ఇప్పుడు ఈయన ఆయుధంగా వాడుకుంటున్నాడు. ఫిబ్రవరి నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. మొత్తానికి చిరంజీవి, బాలయ్య కానీ వచ్చారంటే దసరా 2020 మాత్రం ధమాకా అయిపోతుంది. గత దసరా సీజన్ లో సైరా సినిమాతో వచ్చాడు మెగాస్టార్. పండగ సెలవులను బాగానే క్యాష్ చేసుకున్నాడు ఈయన. ఈ సారి కొరటాల సినిమాతో రాబోతున్నాడు మెగాస్టార్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here