Home News Stories

చింతలపుడి రాజకీయం c/o గ్రూప్ వార్

ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా చింత‌ల‌పుడి రాజ‌కీయం జోరందుకుంది. టీడీపీ అవిర్భావం నుంచి ఇది పార్టీకి కంచుకోటగా ఉంది. ఇక్కడ రాజకీయ వర్గపోరుతో ముక్కోణపు పోటీ అనివార్యమౌతోంది. సిట్టింగ్ ఎమ్మెల్యేగా మజీ మంత్రి పీతల సుజాత ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో గెలుపుకోసం ఎవ‌రికి వారుగా వ్యూహాలు వేసుకుని ముందుకు సాగుతున్నారు. ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌ పడుతుండటంతో నాయ‌కులు టికెట్ల కోసం ఎంత తొంద‌ర ప‌డుతున్నారో.. అదేస‌మ‌యంలో గెలుపు గుర్రం ఎక్కేందుకు కూడా అంతే తొంద‌ర‌గా అడుగులు వేస్తున్నారు. ఇక్కడ అన్ని పార్టీలను గ్రూపుల సమస్య వేధిస్తుంది. చింతలపుడి రాజకీయం పై తెలుగుపాపులర్ టీవీ స్పెషల్ గ్రౌండ్ రిపోర్ట్…

జిల్లాలో చింతలపూడికి ఒక ప్రత్యేకత ఉంది. రైత్వారీ సమస్యలు ఇక్కడ అధికం. విద్య..వైద్యం కూడా అనుకున్నంతగా మెరుగవ్వలేదు. రూ.వందల కోట్ల నిధుల్ని వెచ్చిస్తున్నా పురోగతి అంతంతే అంటారు.2009లో ఈ నియోజకవర్గం ఎస్సీ రిజర్వుడుగా మారిన తర్వాత చాల ఏళ్ళ తర్వత ఈ స్థానం హస్తగతమైంది. మద్దాలి రాజేష్ ఇక్కడ కాంగ్రెస్ నుంచి గెలుపొందారు. నియోజకవర్గ పరిధిలో జంగారెడ్డిగూడెం, చింతలపూడి, కామవరపుకోట, లింగపాలెం మండలాలు ఉన్నాయి. పేరుకే చింతల పూడి కేంద్రంగా ఉంది. జంగారెడ్డిగూడెం ఇక్కడ కీలకంగా మారింది. ఉన్న 2.5 లక్షల ఓట్లలో దాదాపు లక్ష మం ది ఇక్కడే ఉన్నారు. అందుకే అందరి చూపూ ఈ మండలం పైనే ఉంది.


ఈ నియోజక వర్గం పేరు చెప్పగానే కోటగిరి విద్యాధరరావు పేరే గుర్తుకు వస్తాది. ఈయన వరుస గా 5 సార్లు ఇక్కడి జనరల్‌ స్థానంలో నెగ్గారు. ఎన్టిఆర్‌ నాటి ప్రభజనంలో ఈయన ఇండిపెండెంట్‌ గా విజ యం సాధించారు. అసెంబ్లిలో ప్రతిపక్ష నేతగా గళమె త్తారు. మంత్రిగా సక్సెస్‌ అయ్యారు. నాడు పార్టీలో గ్రూప్‌ రాజకీయల్ని ఈయన ధీటుగా ఎదుర్కొన్నారు. మారిన రాజకీయ పరిణామాల్లో కోటగిరి తనయుడు శ్రీధర్ వైసీపీలో చేరి ఏలూరు పార్లమెంట్ వైసీపీ ఇంచార్జ్ గా ఉన్నారు.జిల్లాలో చింతలపూడి కి ప్రత్యేకత ఉంది. రైత్వారీ సమస్యలు ఇక్కడ అధికం. విద్య..వైద్యం కూడా అనుకున్నంతగా మెరుగవ్వలేదు. రూ. వందల కోట్ల నిధు ల్ని వెచ్చిస్తున్నా పురోగతి అంతంతే అంటారు.

పునర్విభజన తర్వాత మొదటి ఎమ్మెల్యేగా మద్దాల రాజేష్‌ నెగ్గారు. రెండో దళిత ఎమ్మేల్యే గా పీతల సుజాత ఉన్నారు. ఈమె నాన్‌ లోకల్‌గా ఉన్నారు. ఇక్కడ ఎమ్మెల్యే,ఎంపీల మధ్య కోల్డ్ వార్ తో సిట్టింగ్‌ ఎమ్మెల్యే పీతల సుజాతకు టిక్కెట్‌ పై సందిగ్ధత ఏర్పడింది. ఇక్కడ టీడీపీ ఇంటర్నల్ కోల్డ్ వార్ తో నాలుగేళ్ళకు గాని కీలక ఏఎంసి చైర్మన్ భర్తీ కాలేదు. దీనిపై రెండు వర్గాల మధ్య పోరు కోర్టు మెట్లు ఎక్కింది. ఎట్టకేలకు ఎంపీ మాగంటి వర్గానికే ఏఎంసి చైర్మన్‌ గిరి దక్కింది. వర్గ పోరుతోనే పీతలకు మంత్రి పదవి మూన్నాళ్ల ముచ్చట య్యింది. అయినా, ఆమె ఏ మాత్రం ఇక్కడ తగ్గకుండ తన గ్రూప్ తో ముందుకెళ్తుంది. సీఎం చంద్ర బాబు, మంత్రి లోకేష్‌ వద్ద ఈమెకు మంచి మార్కులే ఉన్నాయి. కానీ రెండు గ్రూపుల వర్గ పోరుతో పార్టీ పరిస్థితి దయనీయంగా మారింది.

ఇక వైకాపాలోను వర్గపోరు ఎక్కువయ్యింది. ఏలూరు ఎంపీ అభ్యర్థి కోటగిరి శ్రీధర్‌ వర్సెస్‌ మాజీ ఎమ్మెల్యే ఘంటా ముర ళీగా ఉంది. ఇక్కడా గ్రూప్‌ రాజకీయమే రాజ్యమేలు తోంది. చింతలపూడి పార్టీ కన్వీనర్లుగా ఇప్పటికే పలువురు నేతలు మారారు.ప్రస్తుతం ఎలీజా వైకాపా కన్వీనర్‌గా ఉన్నారు. ఇక ఈయనే ఫైనల్‌ అంటున్నారు. ఆర్ధికంగా ఈయన బల వంతుడు. ఇటీవల ఎలీజా పార్టీలో క్రియాశీలంగా మారారు. మాజీ ఎమ్మెల్యే ఘంటా మురళీ ఎంవీఐ విజయ్‌ రాజ్‌ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదే ఎంవీఐ పేరు టిడిపి లోనూ విన్పిస్తోంది. అసమ్మతి రాగం రెండు పార్టీల్లోనూ గొంతెత్తుతోంది.

రెండు పార్టీల మధ్య పోరులో జనసేన ఠారెత్తిస్తోంది. పశ్చిమ ప్రజా పోరాట యాత్రలో జనసేనానికి ఇక్కడి జనం బ్రహ్మరధం పట్టారు. మ‌రోప‌క్క‌ జ‌న‌సేన పార్టీ త‌ర‌ఫున ప్ర‌ముఖ న్యాయ‌వాది మేకా ఈశ్వ‌ర‌య్య బ‌రిలో ఉంటున్న‌ట్టు వినిపిస్తున్నా.. ఈయ‌న హ‌వా పెద్దగా క‌నిపించ‌డం లేదు. ఇక్కడ కాపు సామాజిక వర్గం ఓట్లు కీలకం కానున్నాయి. ప్రధాన పార్టీల్లో వర్గపోరు తమకు లాభిస్తుందంటు న్నారు జనసేన నాయకులు. కాంగ్రెస్‌ నుండి ముప్పిడి శ్రీనివాస్‌, మారుమూడి థామస్‌లు రేసులో ఉన్నారు. బీజేపీ టిక్కెట్‌ చింతలపూడికి చెందిన కుటుంబ రావుకే అంటున్నారు.

ఏదేమైనా అటు టీడీపీ, ఇటు వైసీపీ రెండు పార్టీల్లోనూ గ్రూపు రాజ‌కీయాలే రాజ్య‌మేలుతున్నాయి. మ‌రి ఈ గ్రూపు రాజ‌కీయాల్లో ఎవ‌రు నిలుస్తారో ? ఎవ‌రు గెలిచి గ‌ట్ట‌క్కుతార‌నే విష‌యం ఇక్కడ ఆసక్తికరంగా మారింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here