Home News

    ఢిల్లీ పైకి అదుపు తప్పిన చైనా రాకెట్ లాంగ్ మార్చ్‌…?

    కరోనాతో అల్లాడుతున్న ఢిల్లీకి మరో ముప్పు టెన్షన్ పుట్టిస్తుంది. గగన తలం నుంచి దూసుకువస్తున్న ప్రమాదం ఢిల్లీనే ముంచేస్తుందా అని అంటే దాదాపుగా అవుననే అంటున్నారు ఖగోళ శాస్త్రవేత్తలు. అదుపు తప్పిన చైనా రాకెట్ లాంగ్ మార్చ్‌ 5బీ రేపు భూమిని తాకుతుందని అమెరికా రక్షణ శాఖ అంచనా వేస్తోంది. అయితే ఇది ఎప్పుడు, ఏ దేశంపైన పడుతుందో అన్నది మాత్రం మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.

    ఇలాంటి పరిస్థితుల్లో అమెరికా హార్వర్డ్ స్మితోజియన్‌ ఆస్ట్రోఫిజికల్ ఖగోళ శాస్త్రజ్ఞుడు బాంబులాంటి వార్త పేల్చాడు. సెకనుకు 4 మైళ్ల వేగంతో దూసుకువస్తున్న ఈ చైనా శకలం భారతదేశంపైనే పడే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని, అది కూడా ఢిల్లీపైనే పడుతుందని చెప్తున్నారు. ఇదే కనుక జరిగితే పరిస్థితి ఏంటనేది కూడా ఎవరికీ అంతుపట్టని సమస్యగా ఉంది. అయితే ఈ శకలం బీజింగ్‌, ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరం, బ్రెజిల్‌లోని రియో డీ జెనీరియో నగరాలపై పడే అవకాశాలను కూడా లేకపోలేవని అంటున్నారు. సెకనుకు 4 మైళ్ల వేగంతో భూమి వైపు దూసుకొస్తున్న ఈ రాకెట్ భూమధ్యరేఖకు ఉత్తర, దక్షిణ భాగాలలో 41 డిగ్రీల మధ్య ఉండే ప్రాంతాల్లో ఎక్కడైనా కూలొచ్చని అంటున్నారు.

    అయితే దీన్ని అదుపులోకి తీసుకొని, నిర్జన ప్రదేశాల వైపు మళ్లించే ప్రయత్నాలు చైనా చేస్తుండొచ్చని కూడా చెప్తున్నారు. అదుపు తప్పిన చైనా రాకెట్ ఢిల్లీ పై పడితే దాని ప్రభావం ఎలా ఉంటుందనేది కూడా ఎవరికీ అంచనాలు లేవు. కరోనాతో యుద్దం చేస్తున్న ఢిల్లీ శకలాన్ని ఎలా ఎదుర్కుంటుదనేది కూడా మిలియన్‌ డాలర్ల ప్రశ్నగానే ఉంది.

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here