Home News Updates

చిప్స్ తిని చనిపోయిన చిన్నారి

మీ పిల్లలకు చిప్స్ , జంతికలు, చేగోడీలు లాంటివి కొని ఇస్తున్నారా… అలాగే వడియాలు లాంటివి పెడుతున్నారా … ఓకే పెట్టండి కానీ మీరు దగ్గర వున్నప్పుడే అవన్నీ పెట్టండి లేకుంటే ప్రమాదమే మరి .. ఎందుకంటే….

చిప్స్ 14 నెలల చిన్నారి ప్రాణాలు తీసింది. చిన్నారి గొంతులో చిప్స్ ఇరుక్కుపోవడంతో శ్వాస ఆడక మృతిచెందింది. ఈ విషాద ఘటన రస అల్ ఖైమాలో చోటుచేసుకుంది. చిన్నారి గొంతులో చిప్స్ ఇరుక్కుపోవడం… అది కాస్తా శ్వాసనాళానికి అడ్డుపడడంతో ఆమెకు ఊపిరితీసుకోవడం కష్టంగా మారింది. ఇది గమనించిన చిన్నారి తల్లిదండ్రులు ఆమెను తలకిందులుగా చేసి గొంతుకు అడ్డుపడిన చిప్స్‌ను బయటకు తీసే ప్రయత్నం చేశారు. కానీ ప్రయోజనం లేకపోయింది. దాంతో హుటాహుటిన సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.

అక్కడ వైద్యులు చిన్నారిని కాపాడేందుకు శతవిధాల ప్రయత్నాలు చేసినా అప్పటికే చాలా సమయం గడిచిపోయింది. చాలా సేపటి వరకు శ్వాసనాళం మూసుకుపోవడంతో చిన్నారి మెదడుకు ఆక్సిజన్ అందక ఆమె ముఖం మొత్తం నీలంగా మారిపోయింది. ఆ తరువాత కొద్దిసేపటికే చిన్నారి చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. . రాస్ అల్ ఖైమాలోనే 2018లో కూడా ఇదే తరహా ఘటనలో రెండేళ్ల బాలుడి గొంతులో ద్రాక్ష ఇరుక్కుని చనిపోయాడు.

అలాగే జంతికలు ఇరుక్కుని పిల్లలు చనిపోయిన సంఘటనలు కూడా గతంలో జరిగాయి. అవి నూనె లో సరిగా కాలక పోవడం వాళ్ళ గట్టి పదార్థం అలాగే ఉండిపోయి గొంతుకు అడ్డం పడుతుందని నిపుణులు చెబుతున్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here