Home Entertainment Cinema

ప్రభాస్ పేరుతో మోసం.. ముంబైకి రావాలంటూ ఫోన్..

తెలుగు ఇండస్ట్రీలో ఈ మధ్య మోసాలు ఎక్కువైపోతున్నాయి. ముఖ్యంగా హీరోయిన్లకు ఫోన్లు చేసి లేనిపోని ఆశలు పెట్టి వాళ్ళను కొందరు ఆకతాయిలు మోసం చేస్తున్నారు. ఇప్పుడు కూడా ఇదే జరిగింది. హీరో ప్రభాస్ పేరు వాడుకొని ఒక హీరోయిన్ ని ముంబై వరకు తీసుకొచ్చారు కొందరు వ్యక్తులు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఫోన్ చేసిన వాడు లేడు.. చేస్తే తీసేవాడు కూడా లేడు. దాంతో చివరికి ఆమె మోసపోయానని తెలిసి పోలీసులను ఆశ్రయించింది ఒక హీరోయిన్. అక్కడ వాళ్ళు వాడుకున్న పేరు కూడా హీరో ప్రభాస్ ది. దర్శకుడు సందీప్ రెడ్డి వంగ పేరుతో కాల్స్ చేసి ప్రభాస్ పక్కన హీరోయిన్ గా చేయాలని రాహు మూవీ హీరోయిన్ క్రితి గార్గ్ ను కొందరు అజ్ఞాత వ్యక్తులు అడిగారు. దాంతో ఆమె నిజమే అనుకొని నమ్మి ముంబై వెళ్ళింది. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత పొద్దున్నుంచి ఫోన్ చేస్తే కూడా ఎవరూ లిఫ్ట్ చేయకపోవడంతో తాను మోసపోయానని తెలుసుకుంది. దాంతో ఇక్కడ ఉన్న దర్శకుడు సుబ్బుకి ఫోన్ చేసి అసలు విషయం చెప్పింది కృతి. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో రాహు దర్శకుడు సుబ్బు కంప్లైంట్ ఇచ్చాడు.

ఆ అజ్ఞాత వ్యక్తులు ఎవరో తెలుసుకొని వాళ్లకు సరైన శిక్షపడేలా చేయాలని పోలీసులమని కోరాడు. కంప్లైంట్ తీసుకున్న పోలీసులు వాళ్ళెవరో కనిపెడతామని చెబుతున్నారు. గతంలో కూడా ఇలాగే కొందరు అజ్ఞాత వ్యక్తులు హీరోయిన్లకు ఫోన్ చేసి తమకు అవకాశాలు ఇప్పిస్తానని చెప్పి మోసం చేశారు. ఇప్పుడు మరోసారి ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా పేర్లు వాడుకొని రాహు హీరోయిన్ ని మోసం చేశారు. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. తెలుగు ఇండస్ట్రీలో కూడా కొందరు పెద్దలు ఈ విషయంపై సీరియస్ గా రియాక్ట్ అవుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here