Home News Politics

గ‌ట్టిగా చ‌ప్ప‌ట్లు…

చంద్ర‌బాబు అడుక్కుంటేగానీ కొట్ట‌రు

 

తాను అన‌ర్గ‌ళంగా మాట్లాడుతున్నాన‌ని చంద్ర‌బాబు అనుక్కోవ‌చ్చుగాక‌. మ‌ధ్య‌మ‌ధ్య‌లో స్వ‌రంలో వాల్యూమ్ ఒక్క‌సారిగా పెంచేస్తూ తన ప్ర‌సంగానికి స‌భికులంతా భావోద్వేగంతో ఊగిపోతున్నార‌ని టీడీపీ అధినేత భావించ‌వ‌చ్చుగాక‌. కానీ త‌న‌ ప్ర‌సంగం మొద‌లుకాగానే మినిమం గంట‌ని మీడియావాళ్లు వాచీలెందుకు చూసుకుంటున్నారో, మైకు క‌ట్టేస్తే బ‌తుకుజీవుడా అని త‌మ దారిన తాము వెళ్లిపోదామ‌ని వ‌చ్చిన‌వాళ్లు ఎందుకు కాచుకు కూర్చుంటున్నారో గ్ర‌హించ‌లేక‌పోతున్నారు పాలిటిక్స్‌లో ఫార్టీ ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ.

ఓ ప్ర‌సంగం నిజంగా ఉత్తేజితుల్ని చేస్తే…ఓ నాయ‌కుడి ప్ర‌సంగం గుండెలోతుల్లోకి చొచ్చుకునివెళ్లి భావోద్వేగాల్ని ర‌గిలిస్తే…ఆలోచ‌ల‌న విస్ఫోట‌నాన్ని ర‌గిలిస్తే వ‌ద్దంట్లే చ‌ప్ప‌ట్ల వ‌ర్షం కురుస్తుంది. ప్ర‌సంగాన్ని కొన్ని క్ష‌ణాలు ఆపి మ‌ళ్లీ కొన‌సాగించాల్సి వ‌చ్చేలా క‌ర‌తాళ‌ధ్వ‌నుల‌తో స‌భావేదిక మార్మోగిపోతుంది. కానీ అదేంటో విచిత్రం…అపార‌మైన అనుభ‌వ‌మున్న చంద్ర‌బాబు, అందులోనూ విభ‌జిత ఆంధ్ర‌ప్ర‌దేశ్ బాగుకోసం వేల‌కొద్దీ వీర‌కంక‌ణాలు క‌ట్టుకున్న ఏపీ ముఖ్య‌మంత్రి ప్ర‌తీసారీ అడిగి చ‌ప్ప‌ట్లు కొట్టించుకోవాల్సి వ‌స్తోంది.

ఎవ‌రిదాకో ఎందుకు. పార్టీ నాయ‌కులే వేదిక‌నెక్కిన పాపానికి జైహింద్‌..జై జ‌న్మ‌భూమి అనే ప‌లుకుల‌కోసం చెవులు రెక్కించి వింటున్నారు. ఈ జీవిత‌ఖైదునుంచి విముక్తి ఎప్పుడ‌ని ముళ్ల‌మీద కూర్చున్న‌ట్లు కూర్చుంటున్నారు. విష‌యాన్ని సూటిగా, అర్ధ‌వంతంగా, కాస్త చ‌లోక్తులు జోడించో, అంద‌రి హృద‌యాల‌కు హ‌త్తుకునేలాగానో మాట్లాడే నైపుణ్యం త‌మ అధినేత‌కు ఈ జ‌న్మ‌లో సాధ్యంకాద‌ని పార్టీ నేత‌లంద‌రికీ అర్ధ‌మైపోయిందిగానీ…ఆయ‌న మాత్రం ఓ ప‌ట్టాన మైకు దించ‌డం లేదు. ఎంత‌సేపు అన‌ర్గ‌ళంగా మాట్లాడితే నాయ‌క‌త్వ ప‌టిమ అంత‌గా ఉన్న‌ట్ల‌నే భ్ర‌మ‌లోనే బాబుగారున్నార‌ని ప‌క్క‌కొచ్చిన‌వాళ్లు స‌ణుక్కుంటున్నారు.

కొత్త విష‌యాలేమ‌న్నా ఉంటే పోనీ వ‌చ్చిన‌వాళ్లు ఆస‌క్తిగా వింటారు. ధ‌ర్మ‌పోరాట దీక్ష ప‌లుకులే కొన్ని గంట‌ల్లో సీఎం ర‌మేష్ దీక్ష‌లోనూ వినిపిస్తాయి. మ‌ర్నాడో కార్య‌క్ర‌మం ఉన్నా అదే రికార్డ్ వింటానికి అంతా సిద్ధంకావాల్సి వ‌స్తోంది. త‌క్కువ‌లో త‌క్కువ ఓ గంట మాట్లాడ‌క‌పోతే త‌న రేంజ్ తాను త‌గ్గించుకున్న‌ట్ల‌ని చంద్ర‌బాబు ఫిక్స్ అయిపోయారో ఏంటో. ప‌క్క రాష్ట్ర సీఎం కేసీఆర్ ఓ గంట మాట్లాడితే…58వ నిమిషంలో కూడా అంతా ఆస‌క్తిగానే వింటారు. అంత క‌న్విన్సింగ్‌గా ఉంటుంది కేసీఆర్ ప్ర‌సంగ ప్ర‌వాహం. అదే నాయ‌కుడి ల‌క్ష‌ణం కూడా.

విన‌డం మీ ధ‌ర్మం. విన‌క‌పోతే మీ ఖ‌ర్మం అన్న‌ట్లు ఈ వీరకొట్టుడుకు ముగింపు ప‌ల‌క‌క‌పోతే క‌ష్ట‌మ‌నే అభిప్రాయం పార్టీ నేత‌ల్లోనే ఉంది. ఏడు ప‌దుల వ‌య‌సొచ్చినా చంద్ర‌బాబు ఫిట్‌నెస్ ప‌ర్‌ఫెక్ట్‌గా ఉంది. ఆయ‌న గొంతు ఎన్ని గంట‌లైనా మారుమోగుతూనే ఉంటుంది. అందులో ఎలాంటి సందేహంలేదు. అలాగ‌నీ..చెప్పిందే చెప్పి, ఒక‌టే మూస‌లో దంచితే చెవుల్లో దూదిపెట్టుకుని త‌లూపాల్సి వ‌స్తుంది. విభ‌జ‌న‌లో ఏపీకి అన్యాయం జ‌రిగింద‌నీ..లోటుబ‌డ్జెట్‌తో ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప‌రిస్థితి దారుణాతిదారుణంగా ఉంద‌నీ..కేంద్రం తీర‌ని అన్యాయం చేసింద‌నీ వినీవినీ జ‌నం చెవుల‌కు చిల్లుప‌డేలా ఉంది. వాట్ నెక్ట్స్‌? టీడీపీ అధినేత దానిమీద దృష్టిపెడితే జ‌నం బ‌తికి బ‌ట్ట‌క‌డ‌తారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here