Home News Politics

ఎలాగెలాగెలాగా..అలా అన్లేదా!

వ‌ల‌యంపై చంద్ర‌బాబు వివ‌ర‌ణ‌


త‌ల‌తెగి ప‌డుతుంద‌ని తెలిసినా రొమ్ము విరుచుకునిల‌బ‌డేవాడే నిజ‌మైన నాయ‌కుడు. కానీ ఇష్టంలేని సంసారం చేసి, చివ‌రికి ఆ సంసారం విడాకుల‌దాకా వ‌చ్చి, ఆ త‌ర్వాత కూడా భ‌ర‌ణంగురించి రోడ్డుమీద ప‌డి కొట్లాడుకుంటే చూసేవాళ్ల‌కు కొన్నాళ్ల‌కు సానుభూతి కూడా ఉండ‌దు. రోజూ ఏమిటీ ర‌చ్చ‌నిపిస్తుంది. నాలుగేళ్ల త‌ర్వాత వ్యూహాత్మ‌కంగా ఎన్డీఏనుంచి త‌ప్పుకున్నారు చంద్ర‌బాబు. నాలుగేళ్ల‌లో ఏం చేశార‌ని అడిగితే రెడీమేడ్ ఆన్స‌ర్ ఉండ‌నే ఉంది..29సార్లు ఢిల్లీకెళ్లాన‌ని. ఎన్నోసార్లు అవ‌మాన‌ప‌డ్డాన‌ని. బంధుమిత్రుల ఇళ్ల‌కు ఓ సారి వెళ్తే రిసీవింగ్ స‌రిగా లేక‌పోతేనే మ‌ళ్లీ వాళ్ల మొహం చూడాల‌నిపించదు. స‌రే…రాష్ట్రంకోసం చంద్ర‌బాబు అన్ని అవమానాల్నీ పంటిబిగువ‌న దాచుకుని, గుండెల్లో ర‌గులుతున్న బ‌డ‌బాగుల్ని లోలోనే నీళ్లు చ‌ల్లి ఆర్పేశార‌నుకుందాం. బ‌య‌టికొచ్చాక కూడా మాట‌ల్లో బేల‌త‌నం..కార్యాచ‌ర‌ణ‌లో పిరికిత‌నం ఎందుక‌న్న‌దే ప్ర‌శ్న‌.
సిన్మాల్లో ఛాన్సుల్లేక ప్ర‌త్యేక‌హోదా నినాదంతో అప్పుడ‌ప్పుడూ జ‌నంలో క‌నిపిస్తున్న హీరోఒక‌ప్పుడు శివాజీ ఆప‌రేష‌న్ గ‌రుడ అంటూ ఆ మ‌ధ్య చెప్పిన స్టోరీ కామెడీ మిక్సింగ్ థ్రిల్ల‌ర్ హార‌ర్ థీమ్‌ని మ‌రిపించింది. దానికి బ‌డ్జెట్ ఎంతో..అదెలా అమ‌ల‌వుతోందో ఓ బోర్డెట్టి గీత‌లు గీసి మ‌రీ చూపించాడు శివాజీ. దాన్ని బేస్ చేసుకున్నారో..లేదంటే నీడ‌ని చూసి కూడా ఉలిక్కిప‌డుతున్నారోగానీ ఏపీపై కుట్ర జ‌రుగుతోంద‌న్న మాట చంద్ర‌బాబునోట ప‌దేప‌దే వినిపిస్తోంది. అన్యాయం చేస్తున్నార‌న్నంత‌వ‌ర‌కు ఓకే. ఈ కుట్రేంటో..అదెలా ఉండ‌బోతోంద‌న్న‌దే ఎవ‌రికీ అంతుప‌ట్ట‌టంలేదు.

వైసీపీ సాయంతో టీడీపీ ఎమ్మెల్యేల్లో చీలిక‌తెచ్చి ప్ర‌భుత్వాన్ని కూలుస్తారా? చ‌ంద్ర‌బాబు వాయిస్ రికార్డ్ ఉన్న ఓటుకునోటు కేసు దుమ్ము దులుపుతారా? లేదంటే నాలుగేళ్ల టీడీపీ పాల‌న‌లో ఏపీలో జ‌రిగిన అవినీతిపై విచార‌ణ జ‌రిపిస్తారా? ప‌నిలేనోడు పిల్లి త‌ల గొరిగిన‌ట్లు మూసుకుని ఓ మూల‌నుండ‌క సోమువీర్రాజు అలిపిరి వ్య‌వ‌హారాన్ని కెలికిన‌ట్లు…ఏకంగా మ‌రో స్పాట్ పెడ‌తారా? ఎలాంటి కుట్రో క్లారిటీ ఇచ్చినా బావుండేది.

ధ‌ర్మ‌పోరాట‌దీక్ష త‌ర్వాత గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహ‌న్ వ‌చ్చి చంద్ర‌బాబును క‌లిశారు. ఆయ‌నేం చెప్పారో…ఈయ‌నేం అడిగారో దేవుడికెరుక‌. ఆ త‌ర్వాత గ‌వ‌ర్న‌ర్ల వ్య‌వ‌స్థ శుద్ధ వేస్ట‌ని చంద్ర‌బాబు అంటే రాజ్‌భ‌వ‌న్ సాక్షిగా రాష్ట్ర‌ప్ర‌భుత్వంప‌పై కుట్ర జ‌రుగుతోంద‌ని త‌మ్ముళ్లు అరిచి గీపెడుతున్నారు. కుట్ర కోణాన్ని సెవంటీ ఎంఎంలో చూస్తున్న ఏపీ సీఎం చివ‌రికీ వ్య‌వ‌హారంలో త‌నను అరెస్ట్ చేస్తారేమోన‌ని ఎందుకు భ‌య‌ప‌డుతున్నారో ఎవ‌రికీ అర్ధంకావ‌డంలేదు. అంత దూర‌మొస్తే అంతా త‌న చుట్టూ వ‌ల‌యంలా చేరి కాపాడుకోవాల‌ని చంద్ర‌బాబు చేశారంటున్న వ్యాఖ్య‌లు అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచాయి. క‌ర్ణాట‌క ఎన్నిక‌ల త‌ర్వాత ఏం జ‌రుగుతుందో, ఏం జ‌రుగుతుంద‌ని టీడీపీ భ‌య‌ప‌డుతుందో చెప్పాల‌ని వైసీపీ ఓ ప‌క్క గోకుతోంది.

ఇప్పుడేమో చంద్ర‌బాబు త‌న మాట‌ల్ని వ‌క్రీక‌రించారంటున్నారు. తనకు రక్షణగా ఉండాలని ప్రజలను కోరినట్లు విపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయనేది ఆయ‌న తాజా వివ‌ర‌ణ‌. తనకు రక్షణ కవచంగా ఉండాలని చెప్ప‌లేద‌ట చంద్ర‌బాబు. ఏపీకి రక్షణ కవచంగా ఉండాల‌నే పిలుపునిచ్చార‌ట‌. ముక్తాయింపుగా మ‌ళ్లీ ఆయ‌న అరిగిపోయిన రికార్డునే మ‌ళ్లీ ప్లేచేసి వినిపించారు. నామీద ఎలాంటి కేసులు లేవు.. నేనెవరికీ భయపడను.. నన్నెవరూ ఏం చేయలేర‌ని. అలాంట‌ప్పుడు ఏం పీక్కుంటారో పీక్కోండి అన‌కుండా.. ఎందుకీ రాద్ధాంత‌మంతా?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here