Home News

ఎంపీ కోసం బెజవాడలో ఆ ఇద్దరు నేతలను చంద్రబాబు వదులుకున్నారా ?

టీడీపీ అధినేత చంద్రబాబు లెక్కలు రాజకీయాల్లో తలపండిన నేతలకు సైతం ఒక్కోసారి అర్దం అవ్వదు. తాజాగా బెజవాడ రాజకీయల్లో చంద్రబాబు అనుసరిస్తున్న వ్యూహం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతుంది. స్థానిక ఎన్నికల్లో వచ్చిన విభేదాలతో టీడీపీలో వాయిస్ వినిపించే బుద్దా వెంకన్న,బోండా ఉమా సైలెంట్ అయ్యారు. ఎంపీ కేశినేనికి స్థానిక ఎన్నికల్లో చంద్రబాబు ప్రాధాన్యం ఇవ్వడంతో వీరిద్దరు సైలెంట్ అయ్యారు. ఎంపీకోసం ఈ ఇద్దరు ఫైర్ బ్రాండ్ నేతలను చంద్రబాబు దూరం చేసుకుంటున్నారా అన్న చర్చ బెజవాడ టీడీపీ వర్గాల్లో నడుస్తుంది.

బోండా ఉమాను విజ‌య‌వాడ‌పై మంచి ప‌ట్టున్న నాయ‌కుడిగా గుర్తింపు పొందారు. స్వల్ప తేడాతో గత ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. అదే స‌మ‌యంలో అధికార వైసీపీని గట్టిగానే టార్గెట్ చేశారు. కేశినేని నాని విజయం కోసం గత ఎన్నికల్లో తామంతా పని చేశామని పార్టీ అధికారంలోకి రాకపోయే సరికి కేశినేని పార్టీ లైన్ కి వ్యతిరేకంగా మాట్లాడారని అయినా చంద్రబాబు కేశినేని ప్రాధాన్యత ఇచ్చి తమని చులకన చేశారన్న అభిప్రాయం ఆ ఇద్ద్దరు నేతల్లో ఉంది. కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లో విజ‌య‌వాడ‌లో గెలిచి తీరుతుంద‌ని అంచ‌నాలు వేసుకున్నా అది సాధ్యం కాలేదు. ఇక‌ ఆ త‌ర్వాత‌ నాని సైలెంట్ అయ్యారు. అదే స‌మ‌యంలో పార్టీ వాయిస్ వినిపించే ఈ ఇద్దరు నాయ‌కులు బొండా, బుద్దా వెంక‌న్న‌లు కూడా మౌనం పాటిస్తున్నారు.

చంద్రబాబు ఎంపీ కేశినేనికి ఇచ్చిన ప్రాధాన్యం తమ నేతలకు ఇవ్వడం లేదని బుద్దా,బొండా అనుచరులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేవ‌లం ఎంపీ వైపు మొగ్గు చూప‌డం స‌మంజ‌సం కాద‌ని ఆయ‌న అవ‌స‌ర‌మైతే.. బీజేపీలోకి చేరిపోతార‌ని కానీ, వీళ్లు మాత్రం పార్టీనే న‌మ్ముకుని ఉంటార‌ని చంద్రబాబు గ్రహించ‌లేక పోతున్నార‌ని న‌గ‌ర టీడీపీలో కొంద‌రు నాయ‌కులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here