Home News Politics

సీబీఎన్ ఈవెంట్ మేనేజ్‌మెంట్‌

ప్రొప్ర‌యిట‌ర్ నారా చంద్ర‌బాబునాయుడు

చంద్ర‌బాబు ఏద‌న్నా ప్రోగ్రాం పెట్టుకున్నారంటే హై బ‌డ్జెట్ సిన్మా ఆడియో ఫంక్ష‌న్‌ని మ‌రిపించాల్సిందే. వంద‌కోట్ల సిన్మా స‌క్సెస్‌మీట్‌ని త‌ల‌పించాల్సిందే. ఆయ‌న తాలూకు కార్య‌క్ర‌మ‌మ‌న్నాక ఆ మాత్రం హంగూఆర్భాటం ఉండాల్సిందే. అయితే అతి స‌ర్వ‌త్రా వ‌ర్జ‌యేత్‌…అన్న విష‌యాన్ని ఏపీ సీఎం త‌ర‌చూ మ‌ర్చిపోతున్న‌ట్లున్నారు.
ప్లీన‌రీని మ‌రిపించేలా చుట్టూ చ‌ల్ల‌టి ఏసీలు, మెత్త‌టి ప‌రుపుమీద‌, ఆకాశ‌మంత పందిరివేసి జ‌రిపించిన ధ‌ర్మ‌పోరాట దీక్షా మ‌హోత్స‌వాన్ని చూసిన‌వారెవ‌రిక‌యినా తెలిసిపోతుంది..ఆయ‌నెంత గొప్ప ఈవెంట్ మేనేజ‌రో. ఢిల్లీ సీఎంగా కేజ్రీవాల్ కూడా దీక్ష‌లు చేశాడు. కేంద్రంపై గ‌ట్టిగా గొంతెత్తుతూ బెంగాల్లో మ‌మ‌తాబెన‌ర్జీ కూడా కార్య‌క్ర‌మాలెన్నో నిర్వ‌హించింది. కానీ ఎక్క‌డా ఇంత ప‌క్కాగా పిచ్చ‌పిచ్చ‌గా ప‌బ్లిసిటీ ఇస్తూ ఏ కార్య‌క్ర‌మమూ జ‌ర‌గ‌లేదు.

దాచేప‌ల్లి రేప్ సంఘ‌ట‌న‌లో సీఎం చంద్ర‌బాబు రియాక్ష‌న్ బ‌హుశా దేశంలోనే ఏ రాష్ట్రంలోనూ చూడ‌లేదు. బ‌హుశా భ‌విష్య‌త్తులో చూడ‌లేం కూడా. స‌హ‌జంగానే విప‌క్షం ఈ సంఘ‌ట‌న‌ను ఆస‌రా చేసుకుని ప్ర‌భుత్వం మీద దుమ్మెత్తిపోసే ప్ర‌య‌త్నం చేసింది. మీకంటే నాలుగాకులు ఎక్కువే చ‌దివామ‌ని టీడీపీ నేత‌లు చొక్కాలు చించేసుకున్నారు. వెర‌సి ఓ సున్నిత‌మైన అంశాన్ని అంతా రోడ్డుమీదికి లాగి ర‌చ్చ‌రచ్చ‌చేశారు. ఎక్క‌డ‌యినా ఓ రాష్ట్ర ముఖ్య‌మంత్రిగా ఇలాంటి సంచ‌ల‌న కేసుల పురోగ‌తి ఎలా ఉందో, ఎలా స్పందించాలో ఆదేశించాలి. స‌మీక్షించాలి. కానీ అంత‌వ‌ర‌కే ప‌రిమిత‌మైతే చంద్ర‌బాబు ఎందుక‌వుతారు? రేప్ బాధితురాలి వివ‌రాలే కాదు…ఆ కుటుంబ స‌భ్యుల గురించి కూడా గోప్యంగా ఉంచాల్సిన సున్నిత అంశంలో…బాధిత బాలిక తండ్రిని ప‌క్క‌న‌పెట్టుకుని ప్రెస్‌మీట్ పెట్టేశారు. బాలిక‌ను ప‌రామ‌ర్శించి ఏ సాయం చేస్తున్నామో త‌నే టాంటాం వేసుకున్నారు.

స‌రే…అక్క‌డితో ఆగారా అంటే చంద్ర‌బాబా..మ‌జాకా!?. దాచేప‌ల్లి రేప్ సంఘ‌ట‌న‌లో నిందితుడి ఆత్మ‌హ‌త్య (వేసుకున్నాడో..వేశారో..మొత్తానికి క్లోజ్) త‌ర్వాత వైసీపీ రాజ‌కీయాన్ని తిప్పికొట్టేందుకు కొత్త ప్రోగ్రాం ఎనౌన్స్ చేశారు. ‘ఆడబిడ్డలకు రక్షణగా… కదులుదాం’ కార్య‌క్ర‌మం పేరుతో రాష్ట్ర‌మంతా ర్యాలీలు జ‌రిపారు. మంచిదే…ఆడ‌పిల్ల‌ల విష‌యంలో చైత‌న్యాన్ని పెంచేలా…స‌మాజానికి త‌న బాధ్య‌త‌ను గుర్తుచేసేలా ఎలాంటి కార్య‌క్ర‌మం చేప‌ట్టినా ఆహ్వానించ‌ద‌గిందే. అయితే ఈ కార్య‌క్ర‌మంలోనూ రాజు..వెడ‌లె…అన్న‌ట్లు ఈవెంట్ మేనేజ్‌మెంట్ ఆర్భాట‌మే. విజయవాడ ర్యాలీలో తానే స్వ‌యంగా పాల్గొన‌డ‌మే కాదు ప్ల‌కార్డు కూడా ప‌ట్టుకున్నారు చంద్ర‌బాబు.

చంద్ర‌బాబు ఏద‌న్నా ప్రోగ్రాం పెట్టుకున్నారంటే హై బ‌డ్జెట్ సిన్మా ఆడియో ఫంక్ష‌న్‌ని మ‌రిపించాల్సిందే. వంద‌కోట్ల సిన్మా స‌క్సెస్‌మీట్‌ని త‌ల‌పించాల్సిందే. ఆయ‌న తాలూకు కార్య‌క్ర‌మ‌మ‌న్నాక ఆ మాత్రం హంగూఆర్భాటం ఉండాల్సిందే. అయితే అతి స‌ర్వ‌త్రా వ‌ర్జ‌యేత్‌…అన్న విష‌యాన్ని ఏపీ సీఎం త‌ర‌చూ మ‌ర్చిపోతున్న‌ట్లున్నారు.

ఓ ప‌క్క ప్రోగ్రాం జ‌రుగుతుండ‌గానే నాలుగురోజుల క్రితం జ‌రిగిన మ‌రో మైన‌ర్ బాలిక రేప్ కేసు తెర‌పైకి రావ‌టంతో త‌మ్ముళ్లు కాస్త సంక‌టంలో ప‌డాల్సి వ‌చ్చింది. ఏతావాతా చెప్పొచ్చేదేంటంటే..ఏది చేసినా గ్రాండ్‌గా చేయాలి…అందులో త‌ను ప్ర‌ధాన పాత్ర‌ధారిగా ప‌దిమందిలో క‌నిపించాల‌నే తాప‌త్ర‌యం ఏపీ సీఎంకి ఎక్కువుతోంది. అస‌లే వ‌చ్చేది ఎన్నిక‌ల సీజ‌న్‌. మ‌రోవైపు కేంద్రంపై ధ‌ర్మ‌పోరాటం. మిరిమిట్లు గొలిపే లైటింగులు…క‌ళ్లు చెదిరే సెట్టింగుల మ‌ధ్య ఇంకెన్ని ఈవెంట్లు చూడాల్సి వ‌స్తుందో ఏమో?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here