Home News Politics

చంద్రబాబుకు ఎక్కడేముందో బయటపెట్టిన లోకేష్! ఆస్తులు విలువ ఎంతో తెలుసా?

చంద్రబాబు నికర ఆస్తి రూ.3.87 కోట్లుః టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మీడియా సమావేశం : సేవా భావంతో రాజకీయాల్లోకి వస్తున్నానని ఎన్టీఆర్ చెప్పారు – ఎన్టీఆర్ స్ఫూర్తితో చంద్రబాబు పార్టీని నడిపిస్తున్నారు – మా అమ్మగారు 23 ఏళ్లుగా హెరిటేజ్‌లో పనిచేస్తున్నారు – ఎన్టీఆర్ ట్రస్ట్‌ను ప్రారంభించింది చంద్రబాబు నాయుడే – నారా భువనేశ్వరి ఆస్తులు రూ.50 కోట్లు – చంద్రబాబు ఆస్తులు గత ఏడాదితో పోలిస్తే రూ.87 లక్షలు పెరిగాయి – చంద్రబాబు అప్పులు రూ.5.13 కోట్లు – చంద్రబాబు నికర ఆస్తి రూ.3.87 కోట్లు – భువనేశ్వరి ఆస్తి రూ.53 కోట్ల నుంచి రూ.50 కోట్లకు తగ్గింది – గతంలో కంటే మా అమ్మ ఆస్తులు తగ్గాయి – నా పేరిట ఉన్న నిర్వాణ హోల్డింగ్ షేర్లు బ్రాహ్మణికి బహుమతిగా ఇచ్చాను –

నా ఆస్తులు రూ.8.14 కోట్లు – నన్ను విమర్శించే ముందు మీరు మీ కుటుంబ ఆస్తులు ప్రకటించండి – బినామీ భూములు, ఇన్‌సైడర్ ట్రేడింగ్ ఆరోపణలు చేస్తున్నారు – వైసీపీ ప్రభుత్వం వచ్చి 9 నెలలైంది.. ఒక్కటి నిరూపించలేకపోయారు – క్రమశిక్షణ, పట్టుదలతో వ్యాపారం, రాజకీయాలు చేస్తున్నాం – కావాలనే మాపై ఆరోపణలు చేస్తున్నారు – జగన్ రూ.43 వేల కోట్ల అవినీతి రుజువైంది – పీఏ శ్రీనివాస్ ఇంట్లో ఐటీకి రూ.2.68 లక్షలు దొరికాయి.. ఆయనకే తిరిగిచ్చారు – మేం ఏనాడు తప్పు చేయలేదు.. ఏం దొరకనప్పుడు ఏం చెప్పాలి? – జగన్ లా మేం బినామీ కంపెనీలు పెట్టలేదు – బినామీ కంపెనీల ద్వారా ఇళ్లు కట్టలేదు.. కార్లు కొనలేదు – హెరిటేజ్ ఫుడ్స్ పరంగా ఆస్తులున్నాయి – రాజధాని 29 గ్రామాల్లో హెరిటేజ్‌కు ఎలాంటి భూమి లేదు – రాజధాని బయట 2014లో హెరిటేజ్ పేరిట 9 ఎకరాలు కొన్నారు – కొత్త ప్లాంట్ కోసం భూమి కొన్నారు – 9 ఏళ్లుగా ఆస్తులు ప్రకటిస్తున్న రాజకీయ కుటుంబం మాది – తుగ్లక్ ఆస్తులు ఈడీ, సీబీఐ ప్రకటిస్తుంది – వైసీపీలో కోడిగుడ్డు మీద ఈకలు పీకే బ్యాచ్ ఉంది – అస్తుల విలువ మార్కెట్ విలువ ప్రకారం లెక్కలు వెయ్యలేదు – ప్రజా చైతన్య యాత్రపై 17 మంది మంత్రులు ప్రెస్ మీట్లు పెట్టారు – జగన్ 30 ఏళ్ల సీఎంగా ఉంటారని అంటున్నారు – మేం ప్రజాచైతన్యయాత్ర చేస్తే వైసీపీకి భయమెందుకు? – జగన్ అధికారంలోకి వచ్చాక మూడే చేశారు – ఎక్కడికక్కడ రంగులు మార్చారు..దాడులు చేస్తున్నారు – హామీలపై వెనక్కి పోతున్నారు – ఏపీలో ఈ మూడే జరుగుతున్నాయి – జగన్ పీపీఏలు రద్దు చేసినప్పుడు ఏపీ బ్రాండ్ వ్యాల్యూ పోయింది – ఏపీ బ్రాండ్ వ్యాల్యూ పోగొట్టడానికి నిమిషం చాలు – పోయిన బ్రాండ్ వ్యాల్యూ మళ్లీ రావడానికి శతాబ్దం పడుతుంది – 9 నెలల్లో రాష్ట్రం 20 ఏళ్లు వెనక్కి పోయింది – జనం గగ్గోలు పెడుతున్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here