Home News Politics

చంద్రబాబు ఫైనాన్షియల్ నెట్ వర్క్ టార్గెట్ గా కమలం ఆపరేషన్ ఐటీ…!

నాపై దాడులు చేస్తారు…నన్ను వేధిస్తారు ఈ మాటలన్నది ఎవరో అషామాషి క్యాండెట్ కాదు…ఒక రాష్ట్రానికి సీఎం పాలిటిక్స్ లో అపర చాణక్యుడిగా చెప్పుకునే చంద్రబాబు నాయుడు. అవును మరి రకరకాల కారణాలతో తెలుగుదేశం ఆర్ధిక స్థంభాలు ఒక్కోక్కటిగా దివాళా తీస్తున్నాయి. ఐటీ దాడులు వేరు ఈడీ దాడులు వేరు అన్నట్లు పైకి కనిపిస్తున్నా ఇదంతా పర్టిక్యులర్ నెట్ వర్క్ టార్గెట్ గా నడుస్తున్న గేమ్ స్ట్రాటజీలా ఉంది. మొన్న బీద మస్తాన్ రావు,నిన్న పోతులరామారవు, ఆ తర్వాత సుజనా రిలేటెడ్ కంఫెని ఈప్పుడు సీఎం రమేశ్ ఇలా చంద్రబాబు ఆర్ధిక మూలాల చుట్టు కమలం పార్టీ ఉచ్చు బిగిస్తుందా….

ఓటు కు నోటు కేసంటూ కదలిన ఐటీ,ఈడీ ఆ కోణం నుంచి ఇతర ఆర్ధిక వ్యవహారాల వైపు మళ్ళింది. రాజకీయంగా ఏ పార్టీలో ఉన్నారన్నదాన్ని బట్టి ఇది రాజకీయ కక్షతో జరుగుతున్న దాడులుగా చాలామంది చూస్తున్నప్పటికీ ఇందులో కొత్త కోణాలూ ఇప్పుడు బయటకొస్తున్నాయి. ఏపీలో ఆర్ధికంగా అత్యంత బలవంతుడైన చంద్రబాబు ఫైనాన్షియల్ పిల్లర్లను ఒక్కోక్కటిగా టార్గెట్ చేస్తుంది కమలం పార్టీ. ఇప్పటినుంచే చంద్రబాబు ఆర్ధికమూలాలను దెబ్బతీసి వచ్చే ఎన్నికల నాటికి బాబును కట్టడి చేయలన్నదే టార్గెట్ గా ఐటీ గేమ్ ప్లాన్ చేసింది.

ముఖ్యంగా సుజనా చౌదరి – సీఎం రమేశ్ లు ఎవరన్నది చూస్తే ఈ విషయంలో చాలావరకు క్లారిటి వస్తుంది. సీఎం రమేశ్ తెలుగుదేశం పార్టీలో చాలాకాలంగా చంద్రబాబు వెంట ఉంటూ చిత్తూరు జిల్లా నుంచి కడపకు మారి తెర వెనుక రాజకీయాల్లో త్వరత్వరగా ఎదిగి పార్టీకి ఆర్థికంగా వెన్నుదన్నుగా నిలిచిన నేత. ఇక సుజనా కూడా టీడీపీకి ఆర్థికంగా అండగా ఉంటూ చంద్రబాబు మెప్పు సంపాదించి రాజ్యసభ సభ్యత్వం ఆపై కేంద్రమంత్రి అయిన నేత. ఇద్దరూ పార్టీకి వందల కోట్లు పెట్టుబడి పెట్టినవారే. కాంట్రాక్టులు – కంపెనీలతో భారీగా సంపాదించి ఆర్ధికంగా బలపడి టీడీపీకి ఫైనాన్షియల్ పిల్లర్స్ గా ఉన్నారు. అందుకే ఈ నేతలిద్దరినీ ఇప్పుడు రాజకీయ ప్రత్యర్థులు లక్ష్యంగా చేసుకున్నట్లు కనిపిస్తోంది.

టీడీపీ ఎన్డీయే నుంచి బయటకొచ్చేయడం.. అలాగే పొరుగు రాష్ట్రం తెలంగాణలో పాలక టీఆర్ఎస్ తలపడేందుకు చిరకాల ప్రత్యర్థి కాంగ్రెస్ తో కలిసేందుకు కూడా సిద్ధపడడం.. ఆ పై ఎన్నికల్లో ఫైనాన్షియల్ అండదండలు ఇవన్ని సహజంగా బీజేపీకి మంటపుట్టిస్తున్నాయి. వీటన్నిటి ఫలితమే ఈ తరహా దాడులకు పురిగొల్పిందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఆ క్రమంలోనే టీడీపీకి ఖజానా లాంటి సుజనా ,సీఎం రమేశ్ లను కేంద్ర సంస్థలను వాడుకుని బీజేపీ టార్గెట్ చేసిందని వినిపిస్తోంది.

ఇక సీఎం రమేశ్ అత్యంత విలాసవంతమైన బవంతి అంటూ కొన్ని ఫోటోలను సైతం బయటకు రిలీజ్ చేసింది. డబ్బు ఎలా సంపాదించావ్ కాదు అన్నయ్య ఎంత సంపాదించావు అనే రేంజ్ లో ఉన్న ఆ విలాసవంతమైన భవనం చూస్తే మోడీ కైనా కల్లు కుడతాయేమో మరి…ఇక ఐటీ దాడులు జరుగుతాయాని రేవంత్ లా ముందే ఇన్ ఫర్మేషన్ ఉందేమో సీఎం రమేశ్ కూడా కేంద్రం పై ఎదురుదాడి మొదలెట్టేశాడు..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here