Home News

ఓడిన నాదే పై చేయి అంటున్న చంద్రబాబు..కారణం ఇదేనట

తిరుపతి పార్లమెంట్‌ ఉప ఎన్నికల్లో అధికార వైసీపీ నెగ్గింది. 2019 ఎన్నికల్లో కంటే మెజార్టీ సైతం పెంచుకుంది వైసీపీ.. అయినా టీడీపీ దే పై చేయి అంటున్నారు ఆ పార్టీ అధినేత చంద్రబాబు. ఎన్నికలలో ఓడినా..మెజారిటీ తగ్గించలేకపోయినా తాము అద్భుతంగా పని చేశామని చెప్పుకుంటున్నాయ్ టీడీపీ శ్రేణులు. చంద్రబాబు పోలింగ్ లెక్కలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతున్నాయి.

తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికల్లో తెలుగుదేశం ఓడిపోయింది. గతం కంటే అధికార వైసీపీకి మెజార్టీ పెరిగింది. ప్రతిపక్ష ఓట్ల శాతం 5 శాతం కంటేపైగా తగ్గింది. ఇది పాలనకు రిఫరెండం అంటూ చెప్పిన ప్రభుత్వం మెజారిటీని భారీగా పెంచుకుంది. చంద్రబాబుతో సహా అగ్రనేతలు అంతా తిరుపతిలోనే మకాం వేసి మరీ ప్రచారం చేశారు. పార్లమెంట్ పరిధిని ఏకంగా 70 క్లస్టర్లుగా విభజించి ప్రచారం చేసి ఎన్నికల్లో ఓట్లు అడిగారు. అన్ని శక్తులూ ఒడ్డారు..ఉన్న అస్త్రాలన్నీ ప్రయోగించారు. అయినప్పటికీ తిరుపతిలో టిడిపికి అనుకున్న ఫలితం రాలేదు.

అయితే ఇప్పుడు వచ్చిన ఫలితంపై టీడీపీ అధినేత చంద్రబాబు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితిల్లో వచ్చిన ఫలితం మెరుగైనదే అని చెపుతోంది టీడీపీ. అధికార పార్టీ చేప్పిన 5 లేదా ఆరు లక్షల మెజిరిటీ సవాళ్లు ఇప్పుడు టిడిపి అనుకూలంగా మార్చుకుంటోంది. తాము ఓడినా మెజారిటీ మూడు లక్షలు దాటకుండా చేయడం గొప్ప ఫలితంగానే చెబుతోంది. సాధారణంగా ఇలాంటి ఫలితాల పట్ల సంతృప్తి వ్యక్తం చేయని చంద్రబాబు పార్టీ బాగా పనిచేసిందని 3 లక్షలు దాటకుండా నిలువరించడం క్యాడర్ గొప్పదనమేనంటున్నారు. నైతిక విజయం తమదే అంటున్నారు.

ఉప ఎన్నికలో ఏ రాజకీయ పార్టీ డబ్బులు పంపిణీ చేయలేదు. ఇలాంటి సమయంలో ఎలాంటి ఫలితం వస్తుందా అని రకరాకాల అంచానాలు వేశాయి. ఐదారులక్షల మెజారిటీ అంటూ చెప్పిన వైసీపీ ఆ ఫిగర్‌ను రీచ్‌ అవలేదు. దీంతో తెలుగుదేశం పార్టీ రిలాక్స్‌ అవుతోంది. గెలుపు ఎలా ఉన్నా మంచి పోరాటం చేశామన్నది తెలుగు తమ్ముళ్ల వాదన. దీంతో తమకు వచ్చిన ఓటింగ్ 5 శాతం పడిపోయినా ఫలితం పట్ల టిడిపి సంతృప్తిగానే ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here